Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Urvashi Rautela: భారత్ గెలుపు.. ఐటమ్ గర్ల్‌ ఏడుపు!

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌటెలా తన ఫోన్‌ను పోగొట్టుకుంది. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ బిగ్ మ్యాచ్‌కు హాజరైన ఊర్వశి రౌటెలా.. తన అందచందాలతో సందడి చేసింది. లక్షా 30 వేల మంది అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఈ బాలీవుడ్ బ్యూటీ.. బ్లూ టాప్‌లో తన అందాలతో మెరిసి కనువిందు చేసింది.

ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మెగా టోర్నీలో పాకిస్థాన్‌ను అష్ట దిగ్భంధం చేయగా.. ఊర్వశి ఆ ఆనందంలో ఎగిరి గంతేసింది. ఈ క్రమంలోనే ఆమె తన ఐఫోన్‌ను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి రౌటెలానే ఎక్స్‌వేదికగా తెలియజేసింది. ఈ విషయంలో ఎవరైనా తనకు సాయం చేయాలని, మొబైల్ కనిపెట్టాలని విజ్ఞప్తి చేసింది.

Urvashi Rautela loses her 24 carat real gold iPhone during India-Pakistan match

'నా 24 క్యారెట్ల రియల్ గోల్డ్ ఐఫోన్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పోయింది. ఎవరికైనా అది కనబడితే దయచేసి సాయం చేయండి. వీలైనంత త్వరగా నన్ను కాంటాక్ట్ అవ్వండి.'అని #LostPhone #AhmedabadStadium, #HelpNeeded #indvspak హ్యాష్ ట్యాగ్‌లతో మోదీ స్టేడియం, అహ్మదాబాద్ పోలీసులకు ఊర్వశి ట్యాగ్ చేసింది.

ఈ ట్వీట్‌పై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అయ్యో పాపం అంటే.. మరికొందరు కొత్తది కొనుక్కో అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే 'ఏమైనా సీక్రెట్స్ మొబైల్‌లో ఉన్నాయా? అంతలా భయపడుతున్నావ్?'అని ప్రశ్నిస్తున్నారు. వంటి మీద ఉన్న సోయి.. ఫోన్ మీద ఉంటే ఇలా జరిగేది కాదని సెటైర్లు పేల్చుతున్నారు. పంత్ అభిమానులే కొట్టేసి ఉంటారని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఊర్వశీ రౌటెలాకు రిషభ్ పంత్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. రిషభ్ పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలా చెప్పుకొచ్చింది. రిషభ్ పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయిన రిషభ్ పంత్ పాపులారిటీ కోసం ఇంత దిగుజారాలా?అని ప్రశ్నించాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్లు వాగ్వాదం నడిచింది.

పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో సైలెంట్ అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. అతను త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది.

Story first published: Sunday, October 15, 2023, 17:25 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+