యాక్సిడెంట్ అయినా రిషభ్ పంత్‌ను వదలని ఊర్వశి రౌటేలా.. హాట్ ఫొటోతో!

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా.. అతని రోడ్డు ప్రమాదంపై కూడా స్పందించింది. క్రిప్టిక్ ఇన్‌స్టా పోస్టుతో పంత్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపింది. అయితే ఈ పోస్ట్‌కు హాట్ ఫొటో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. దేవకన్య గెటప్‌లో హాట్‌గా చూస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన ఊర్వశి... దానికి 'ప్రార్థిస్తున్నా' అనే కాప్షన్ జోడించడాన్ని రిషభ్ పంత్ అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఊర్వశి, రిషబ్ పంత్ గురించి నిజంగా అంత బాధపడుతుంటే.. అతని ఫోటో పెట్టి, ఇలాంటి కాప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేదని... కనీసం అలా చేసి ఉంటే కష్టకాలంలో అతను బాగుండాలని కోరుకుంటుందనే సానుభూతి అయినా ఆమెకు దక్కి ఉండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో బిజీ..
ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పబ్లిసిటీ కోసం, క్రేజ్ కోసం ఊర్వశి రౌటేలా ఇలాంటి పనులు చేస్తోందని మరోసారి తేలిపోయిందని పంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ అయిన ఊర్వశి రౌటేలా.. శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. ఓ ఇంటర్వ్యూలో పంత్ పేరు ప్రస్తావించకుండా ఉర్వశి సంచలన ఆరోపణలు చేయగా.. పంత్ ఖండించాడు. దాంతో ఈ ఇద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

తనతో సెక్స్ చేయడానికి..
రిషభ్ పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని సంచలన ఆరోపణలు చేసిన ఊర్వశీ రౌటేటా.. ఆసియా కప్ ముందు సోషల్ మీడియా వేదికగా అతనితో వాగ్వాదానికి దిగింది. రిషభ్ పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని ఓ ఇంటర్వ్యూలో రౌటేలా చెప్పగా.. పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా? అంటూ భారత వికెట్ కీపర్ కౌంటరిచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఊర్వశీ బ్యాట్ బాల్ ఆడుకోవాలని, నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తానని హెచ్చరించింది.

పిల్ల బచ్చా అంటూ..
'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీనికి పంత్ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. మన ఆధీనంలో లేని విషయాలను ఏ మాత్రం పట్టించుకోవద్దని బదులిచ్చాడు.

ప్రాణాలతో బయటపడ్డ పంత్..
పంత్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దాంతో వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా హరిద్వార్ జిల్లాలో మంగళూరు, నర్సన్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్వయంగా కారు డ్రైవ్ చేసిన పంత్.. నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడని చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications