న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరే ఓ చోటు బ్యాట్ బాల్ ఆడుకో.. నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తా! రిషభ్ పంత్‌కు ఊర్వశీ రౌటెల వార్నింగ్!

Urvashi Rautela critically hits back at Rishabh Pant, says Chotu bhaiyaa should play bat ball
ఊర్వశి రౌటెలాపై రిషభ్ పంత్ ఫైర్,పాపులారిటీ కోసం ఇంత దిగజారతారా? *Cricket | Telugu OneIndia

హైదరాబాద్: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా మాటల యుద్దం కొనసాగుతోంది. పాపులారిటీ కోసం ఊర్వశి రౌటెలా దిగజారి మాట్లాడుతుందని, పచ్చి అబద్దాలు ఆడుతుందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిషభ్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ఊర్వశి ఘాటుగా స్పందించింది. అరే ఓ చోటు.. బ్యాట్ బాల్ ఆడుకో.. నకరాలు చేస్తే నరాలు తీస్తాననే ఘాటు వ్యాఖ్యలతో హెచ్చరించింది. సైలెంట్‌గా ఉన్నానని రెచ్చిపోతే ఇజ్జత్ తీస్తానని మండిపడింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని ఆరోపించింది.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

ఊర్వశి రౌటెలాతో రిషభ్ పంత్ రిలేషన్‌లో ఉన్నాడని గతంలో వార్తలు షికారు చేశాయి. వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే రిషభ్ పంత్ ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఊర్వశి రౌటెలాను బ్లాక్ చేసి తమ మధ్య ఏం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అప్పట్లో ఇది మీడియాలో పెద్ద సెన్సేషనల్ వార్తగా మారింది. ఆ కొద్ది రోజులకే రిషభ్ పంత్, ఇషా నేగి అనే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. దాంతో ఊర్వశి రౌటెలాకు పంత్‌ మధ్య ఏం లేదనే క్లారిటీ వచ్చింది. అయితే ఊర్వశి రౌటెలా మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా పంత్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఉంది.

పంత్ నా కోసం వచ్చాడు..

పంత్ నా కోసం వచ్చాడు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేరు చెప్పుకుండా రిషభ్ పంత్‌తో తనకు ఎక్కడ తేడా వచ్చిందనే విషయాన్ని ఊర్వశి బయటపెట్టింది. వారణాసిలో ఓ షూటింగ్‌లో పాల్గొన్న తనను కలవడానికి రిషభ్ పంత్ వచ్చాడని, తాను తీవ్రంగా అలసిపోయి హోటల్‌లో పడుకోవడంతో అతన్ని కలవలేకపోయానని చెప్పింది. అతను దాదాపు 17 సార్లు ఫోన్ చేసి వెళ్లిపోయాడని, వెంటనే ఫోన్ చేసి ముంబైలో కలుస్తానని చెప్పానని పేర్కొంది. చెప్పినట్టే ముంబైకి వెళ్లినప్పుడు కలిసానని, అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీయదు కానీ అతనుతనతో మాట్లాడటం మానేసాడని చెప్పింది.

పాపులారిటీ కోసం పచ్చి అబద్దాలు..

పాపులారిటీ కోసం పచ్చి అబద్దాలు..

ఈ వాఖ్యలు సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్ కావడంతో రిషభ్ పంత్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'కొందరు ఫేమ్, పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడే వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి. ' అని ఇన్‌స్టా స్టోరీలో పంత్ రాసుకొచ్చాడు. పరోక్షంగా తన గురించి ఊర్వశీ చెప్పింది పచ్చి అబద్దమని పంత్ తెలియజేశాడు.

నీ బండారం బయటపెడతా..

నీ బండారం బయటపెడతా..

ఇక రిషభ్ పంత్ పోస్ట్‌పై స్పందించిన ఊర్వశి రౌటెలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, డోంట్‌ టేక్‌ అడ్వాంటేజ్‌ ఆఫ్‌ ఏ సైలెంట్‌ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Story first published: Friday, August 12, 2022, 16:46 [IST]
Other articles published on Aug 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X