Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ రోజు నుంచే ఉప్పల్ టెస్ట్ టికెట్ల విక్రయం.. ధర ఎంతంటే..?

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025‌లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కీలక ప్రకటన చేసింది.

పేటీఎం ఇన్‌సైడర్ యాప్ ద్వారా జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఈ నెల 22 నుంచి జింఖానా స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో టికెట్లు తీసుకోవచ్చని తెలిపింది. జింఖానా స్టేడియంలో ఆఫ్‌లైన్ టికెట్లు కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది.

Uppal Test tickets on sale between India vs England from January 18

ఈ మ్యాచ్ నేపథ్యంలో స్కూల్ విద్యార్థుల కోసం 25వేల కాంప్లిమెంటరీ పాసులు ఇస్తున్నట్లు హెచ్‌సీఏ పేర్కొంది. అంతేకాకుండా ఈ పాస్‌ల ద్వారా మ్యాచ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా భోజనం కూడా అందజేస్తామని వెల్లడించింది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కూడా.. రిపబ్లిక్ డే రోజును ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని పేర్కొంది.

ఆసక్తి గల వారు ఈనెల 18వ తేదీలోగా.. తమ విభాగపు చీఫ్‌తో సంతకం చేయించిన లేఖను.. కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కనిష్టంగా రూ. 200, గరిష్టంగా 400గా నిర్ణయించారు. ఈ సిరీస్‌లో పాల్గొనే ఇరు జట్లను ఆయా క్రికెట్ బోర్డ్స్ ఇప్పటికే ప్రకటించాయి.

ఇంగ్లండ్ యూఏఈ వేదికగా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. అఫ్గాన్‌తో బుధవారం సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా టెస్ట్ ప్రిపరేషన్స్‌ను మొదలు పెట్టనుంది.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్‌

ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.

Story first published: Monday, January 15, 2024, 16:22 [IST]
Other articles published on Jan 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+