For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025 వేలంలో ఛీ కొట్టారు.. తీరా చూస్తే 7 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. తమ దేశ ఫ్రాంచైజీ టీ20 టోర్నీ బిగ్‌ బాష్ లీగ్‌(బీబీఎల్)లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టీవ్ స్మిత్.. పెర్త్ స్కార్చర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్‌లో అన్‌సోల్డ్..
గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో విఫలమవడంతో స్టీవ్ స్మిత్‌పై టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ముద్ర పడింది. ఈ క్రమంలోనే అతన్ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దాంతో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. గత మూడు సీజన్లలో కూడా అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. చివరిసారిగా ఐపీఎల్ 2021‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Unsold In IPL 2025 Auction Steve Smith Slams 3 Centuries In Last 7 Innings In BBL

ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ ద్వారా ఫామ్ అందుకున్న స్మిత్.. బిగ్ బాష్ లీగ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. పెర్త్ స్కార్చర్స్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన స్మిత్.. మరో 22 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్మిత్‌కు ఇది మూడో బీబీఎల్ సెంచరీ.

ఆల్‌టైమ్ రికార్డ్ సమం..
దాంతో బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా మెక్‌డెర్మాట్(3 సెంచరీలు) రికార్డ్‌ను సమం చేశాడు. 2011 నుంచి ఇప్పటి వరకు స్మిత్ 32 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. మెక్‌డెర్మాట్ మాత్రం 100 మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన ఆటగాడు కావడంతో స్మిత్.. బీబీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు.

స్మిత్ శతకంతో ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. అనంతరం పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులే చేసి ఓటమిపాలైంది. అష్టన్ టర్నర్(32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది.

7 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు..
బీబీఎల్‌లో గత 7 ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ 3 శతకాలు అందుకోవడం గమనార్హం. ఈ సూపర్ ఫామ్ నేపథ్యంలో అతనికి ఐపీఎల్ టీమ్స్ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రీలంక పర్యటనలో అతనే జట్టును నడిపించనున్నాయి. ఈ పర్యటనకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు.

Story first published: Saturday, January 11, 2025, 14:51 [IST]
Other articles published on Jan 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+