IPL 2026: పాపం ఇషాన్ కిషన్.. పులి షాట్‌కు బలి!
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ ఇషన్ కిషన్‌ను దురదృష్టం వెంటాడింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అన్ లక్కీగా పెవిలియన్ చేరాడు. విధ్వంసకర ఓపెనర్, ఆరెంజ్ ఆర్మీ షేర్ అభిషేక్ శర్మ షాట్ ధాటికి ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఈ దురుదృష్టకర ఘటనతో ఇషాన్ కిషన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ట్రావిస్ హెడ్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ వచ్చి రావడంతో 2 బౌండరీలు, ఒక సిక్స్‌తో జోరు కనబర్చాడు. అయితే నితీష్ రాణా వేసిన 15వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ మరో బౌండరీ బాదాడు.

ఈ ఓవర్ నాలుగో బంతిని అభిషేక్ శర్మ స్ట్రైట్‌గా షాట్ ఆడాడు. ఆ బంతి కాస్త నితీష్ రాణా చేతులు తాకి నాన్ స్ట్రైకర్ వికెట్లను పడేసింది. అప్పటికే క్రీజు ధాటిన ఇషాన్ కిషన్ అప్రమత్తమయ్యేలోపే వికెట్లు పడిపోయాయి. రెప్పపాటు సమయంలోనే అతను రనౌట్‌గా వెనుదిరిగాడు.
ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. పాపం ఇషాన్ కిషన్.. పులి షాట్‌కు బలి అని ఒకరంటే.. కెప్టెన్ సాబ్ గాశారం బాలేదని మరొకరు జాలి చూపారు. ఇషాన్ కిషన్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్ చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ఇషాన్ కిషన్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications