Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతాలో మ్యాచ్: యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్‌కు అరుదైన గౌరవం

Universe Boss Chris Gayle rings iconic bell at eden gardens kolkata

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈడెన్ గార్డెన్స్‌లో ప్రతి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఈ మైదానంలో ఉన్న గంటను మోగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, శనివారం ఈ అరుదైన అవకాశాన్ని క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ క్రిస్ గేల్‌కు కల్పించింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు గేల్‌ గంట మోగించాడు. ఇప్పటి వరకు ప్రముఖ మాజీ క్రికెటర్లు, అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు మాత్రమే ఈ అవకాశం లభించింది.

గతంలో కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, బ్రెట్‌ లీ, షేన్ వార్న్‌లతో పాటు మహిళా క్రికెటర్ జులన్ గోస్వామికి ఈ అద్భుత అవకాశం దక్కింది. ఇప్పుడు ఈ జాబితాలో క్రిస్ గేల్ కూడా చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఇప్పటివరకు క్రిస్ గేల్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్ జట్టుని ఒంటి చేత్తో గెలిపించాడు. గేల్ ఆడిన రెండు మ్యాచుల్లో 68, 104 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్ ఆడుతున్న గేల్‌ బెల్‌ని మోగించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.

Story first published: Saturday, April 21, 2018, 17:19 [IST]
Other articles published on Apr 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+