Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తిలక్ వర్మ వృషణాలకు ఏమైందంటే?

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ వృషణాలకు శస్త్ర చికిత్స జరిగింది. టెస్టిక్యులర్ టోర్షన్ అనే సమస్యతో అతనికి తీవ్రమైన నొప్పి రావడంతో రాజ్‌కోట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం సర్జరీ నిర్వహించారు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున తిలక్ వర్మ బరిలోకి దిగాడు.

మ్యాచ్ సందర్భంగా అతనికి ఎలాంటి గాయం కాలేదు. కానీ బుధవారం వృషణాల్లో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. ఆసుపత్రికి తరలించి స్కానింగ్ తీశాక.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. బీసీసీఐ స్పెషలిస్ట్ వైద్యులు కూడా సర్జరీ తప్పదని తేల్చడంతో తిలక్ వర్మకు శస్త్ర చికిత్స చేశారు.

మూడు టీ20లకు దూరం..

సర్జరీ విజయవంతమైందని, తిలక్ వేగంగా కోలుకుంటున్నాడని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్‌కు కూడా వెళ్లిపోయాడని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ సర్జరీ కారణంగా న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమయ్యాడని తెలిపింది.

ఆ తర్వాత ఆడేది అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. టీ20 ప్రపంచకప్ 2026 ముందు తిలక్ వర్మకు సర్జరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. మెగా టోర్నీ సమయానికి అతను పూర్తి ఫిట్‌నెస్ సాధాస్తాడా? లేదా? అనేది సందేహంగా మారింది. అతను పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 4 వారాలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

Understanding Testicular Torsion Causes Symptoms and Recovery After Tilak Varma s Surgery

టెస్టిక్యులర్ టోర్షన్ అంటే ఏంటంటే?

టెస్టిక్యులర్ టోర్షన్ అనేది పురుషుల్లో వచ్చే అత్యవసర మెడికల్ పరిస్థితి. వృషణాలకు రక్త ప్రసరణను అందించే నరం(స్పెర్మాటిక్ కార్డ్) మెలిక పడటాన్ని టెస్టిక్యులర్ టోర్షన్ అంటారు. దీనివల్ల వృషణానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం అందకపోతే వృషణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

టెస్టిక్యులర్ టోర్షన్‌కు కారణాలు..?

వృషణాల్లో నరం మెలికపడటానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది పుట్టుకతో వృషణాలు వదులుగా ఉంటాయి. దీని వల్ల నరం మెలికపడుతుంది. ఆకస్మాత్తుగా వృషణాలకు గాయాలైనప్పుడు కూడా నరం మెలికపడవచ్చు. ముఖ్యంగా క్రీడలు ఆడుతున్నప్పుడు ఏదైనా వస్తువు బలంగా తాకినప్పుడు ఈ సమస్య తలెత్తవచ్చు.

తీవ్రమైన వ్యాయామం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. అకస్మాత్తుగా కండరాలపై ఒత్తిడి పడి నరం మెలిక పడవచ్చు. చల్లని వాతావరణం వల్ల కూడా కండరాలు కుంచించుకుపోయి మెలిక పడవచ్చు. కొన్నిసార్లు గాఢ నిద్రలో కండరాల కదలికల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.

లక్షణాలు ఏంటంటే..?

వృషణంలో అకస్మాత్తుగా విపరీతమైన నొప్పి రావడం.

వృషణానికి వాపు రావడం, ఎర్రగా మారడం.

తీవ్రమైన కడుపు నొప్పి, వికారం, వాంతులు.

ఒక వృషణం సాధారణం కంటే కిందకి జారడం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స ఏంటంటే..?

ఈ సమస్య తలెత్తినప్పుడు అశ్రద్ద చేయకుండా వైద్యులను సంప్రదించాలి. నొప్పి మొదలైన 6 గంటల్లోపు చికిత్స అందిస్తే వృషణాన్ని కాపాడే అవకాశం 90 శాతం ఉంటుంది. 12 గంటలు దాటితే ఆ అవకాశం 50 శాతానికి తగ్గిపోతుంది.

సర్జరీ ద్వారా మెలికను తీసి, మళ్లీ పడకుండా కుట్లు వేస్తారు. క్రీడాకారులు కచ్చితంగా అబ్డామినల్ గార్డ్ ధరించాలి. నొప్పిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.

Story first published: Friday, January 9, 2026, 13:30 [IST]
Other articles published on Jan 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+