For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Under-19s Asia Cup: చెలరేగిన తెలుగు కుర్రాడు.. ఫైనల్లో భారత్!

Under-19 Asia Cup: Telugu guy Sheikh Rashid hits unbeaten fifty to help India beat Bangladesh in Semi final

షార్జా: అండర్-19 ఆసియా కప్ టోర్నీలో తెలుగు కుర్రాడు షేక్ రషీద్(108 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 90 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యువ భారత్ 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యశ్‌ధుల్ నేతృత్వంలోని టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగులు చేసింది. షేక్ రషీద్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యశ్‌ దుల్(26), విక్కీ(28 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ మూడు వికెట్లు తీయగా.. తంజీమ్, నైముర్, మెహరోబ్, అరిఫుల్ తలో వికెట్ తీశారు.

బంగ్లా చిత్తు..

బంగ్లా చిత్తు..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 38.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. అరిఫుల్ ఇస్లామ్(42), మహ్‌ఫిజుల్ ఇస్లామ్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాజవర్ధన్ హంగర్‌గేకర్, రవి కుమార్, రాజ్ భావ, విక్కీ తలో రెండు వికెట్లు తీశారు. నిశాంత్, కౌశల్ చెరొక వికెట్ పడగొట్టారు. అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం షేక్ రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత ఇన్నింగ్స్‌లో ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు షేక్ రషీద్ ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ యశ్ దుల్‌తో 41, రాజ్ భవ్‌తో 46, విక్కీతో 50 పరుగుల విలువైన భాగస్వామ్యాలు జోడించాడు. ఫైనల్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

మన గుంటూరోడే..

మన గుంటూరోడే..

షేక్‌ రషీద్‌ స్వస్థలం గుంటూరు జిల్లా.. ప్రత్తిపాడులోని మల్లయ పాలెం. తండ్రి బలీషా వలీ లోన్‌ రికవరీ ఏజెంట్‌గా పనిచేసే చిరుద్యోగి. వలీ సంపాదన అంతంత మాత్రమే అయినా కొడుకు ఆసక్తిని గమనించి అతడికి ఏడేళ్ల వయసునుంచే క్రికెట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. తొమ్మిదో ఏటనే అండర్‌-14 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రషీద్‌ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్‌ జిల్లాల పోటీల్లో భాగంగా శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన రషీద్‌ను స్థానికులు చిచ్చర పిడుగుగా పిలుస్తుంటారు.

కోచ్‌ కృష్ణారావు దగ్గర క్రికెట్‌ ఓనమాలు నేర్చుకున్న ఈ కుర్రాడు ప్రస్తుతం ఆంధ్ర అండర్‌-19 టీమ్‌ చీఫ్‌ కోచ్‌ జ్ఞానేశ్వరరావు దగ్గర రాటు దేలాడు. బంతిని అంచనా వేయడంలో, షాట్ల ఎంపికలో అద్భుతమైన నైపుణ్యం దొరకబుచ్చుకున్న రషీద్‌ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే కనీసం హాఫ్‌ సెంచరీ బాదకుండా పెవిలియన్‌ చేరడు. విరాట్‌ కోహ్లీని అమితంగా ఆరాధించే రషీద్‌కు అతని పోరాట పటిమంటే చాలా ఇష్టం. సీనియర్లు శ్రీకర్‌ భరత్‌, కేవీ శశికాంత్‌తో సన్నిహితంగా ఉండే రషీద్‌ అవసరమైనప్పుడు వారి సలహాలు తీసుకుంటుంటాడు.

ఇండియా ఎ కెప్టెన్‌గా...

ఇండియా ఎ కెప్టెన్‌గా...

2017లో అండర్‌-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హయ్యెస్ట్ రన్నర్‌గా రషీద్ నిలిచాడు. తర్వాతి ఏడాది అండర్‌-19లో 680 రన్స్‌తో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా తన సత్తా ఏంటో సెలెక్టర్లకు తెలియజేశాడు. ఐదేళ్లుగా ఆంధ్ర అండర్‌-14,16,19 జట్లకు నాయకత్వం వహిస్తున్న రషీద్‌.. ఈ ఏడాది నవంబరు 28 నుంచి డిసెంబరు 7 వరకు జరిగిన అండర్‌-19 బంగ్లాదేశ్‌, ఇండియా-ఎ, ఇండియా-బి ట్రై సిరీ్‌సలో 'ఎ' జట్టుకు సారథ్యం వహించాడు.

సెంచరీలంటే..

సెంచరీలంటే..

ఈ ఏడాది వినూ మన్కడ్‌లో ఆరు మ్యాచ్‌లాడిన రషీద్‌ రెండు శతకాలు, రెండు హాఫ్‌ సెంచరీలతో 400కు పైగా పరుగులు చేసి దుమ్మురేపాడు. చాలెంజర్‌ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన ఈ మణికట్టు స్ట్రోక్‌ ప్లేయర్‌ ఒక అజేయ సెంచరీ సహా 275 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.'సచిన్‌, కోహ్లీ ఆట అంటే చాలా ఇష్టం. భారత యువ జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది.

మా నాన్న ప్రైవేటు ఉద్యోగి కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. నాన్న స్నేహితుడు ఇంద్రసేనారెడ్డి సాయం, మంగళగిరి అకాడమీలో కోచ్‌లు కృష్ణారావు, సీతాపతి, వినోద్‌, జ్ఞానేశ్వర్‌ శిక్షణ వల్ల ఈ స్థాయికి రాగలిగాను" అని రషీద్‌ తెలిపాడు.

ఈనెల 23 నుంచి జరిగే ఆసియాక్‌పలో ఆడేందుకు రషీద్‌ సోమవారం దుబాయ్‌ బయలుదేరి వెళ్లాడు. జనవరిలో ప్రారంభమవనున్న ఈ మెగా టోర్నీలో భారత బ్యాటింగ్‌ తురుపుముక్కగా భావిస్తున్న రషీద్‌ అంచనాలకు తగ్గట్టు రాణించి త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టాలని ఆశిద్దాం.

Story first published: Thursday, December 30, 2021, 21:35 [IST]
Other articles published on Dec 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+