Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిప్పులు చెరిగిన కావ్య పాప డైనమైట్.. ఐపీఎల్ 2026లో చుక్కలే!

బిగ్‌బాష్ లీగ్ 2025-26లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ నిప్పులు చెరిగాడు. సిడ్నీ సిక్సర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆస్ట్రేలియా అనామక పేసర్ సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో జాక్ ఎడ్వర్డ్స్(5/26) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. దాంతో ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 47 పరుగులతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. జోష్ ఫిలిప్పి(57 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96) సెంచరీ చేజార్చుకోగా.. బాబర్ ఆజామ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించాడు.

అనంతరం 19.1 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సామ్ బిల్లింగ్స్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. జాక్ ఎడ్వర్డ్స్‌(5/26) ఐదు వికెట్లతో పతనాన్ని శాసించాడు. జోయల్ డేవిస్(3/24) మూడు వికెట్లు తీయగా.. టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు.

Uncapped Australian All-Rounder Shines with Career-Best T20 Figures Days After Securing Maiden IPL Deal with SRH

ఇటీవల అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు జాక్ ఎడ్వర్డ్స్‌ను రూ. 3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వేలంలో అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీపడినప్పటికీ, కావ్య మారన్ పోటీపడి మరి కొనుగోలు చేసింది. అతని తాజా ప్రదర్శనతో సన్‌రైజర్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జాక్ ఎడ్వర్డ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలక ఆటగాడిగా మారనున్నాడని జోస్యం చెబుతున్నారు.

వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు)

రిటైన్ లిస్ట్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.

Story first published: Monday, December 22, 2025, 16:34 [IST]
Other articles published on Dec 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+