Umran Malik: ఆ విషయంలో కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌కు తిరుగు లేదు.. 13 మ్యాచ్‌లకు 13 లక్షలు అతనివే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్.. 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతని పేస్ ధాటికి ఇషాన్ కిషన్, డానియల్ సామ్స్, తిలక్ వర్మ బలయ్యారు.
అంతేకాకుండా వరుసగా 13వ మ్యాచ్‌లోనూ వేగవంతమైన బంతిని వేసి ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు అందుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 13 సార్లు ఉమ్రాన్ మాలిక్‌నే ఈ అవార్డు వరించడం విశేషం. ఈ అవార్డు పేరిట ఇప్పటికే రూ.13 లక్షలను ఉమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో ఎంతటి ఫేమస్ పేసర్ ఉన్నా సరే... ఫాస్టెస్ట్ డెలవరీ అవార్డు మాత్రం ఉమ్రాన్‌కే. ముంబైతో మ్యాచ్‌లో గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
157 కిలోమీటర్ల వేగంతో రికార్డు..
ఐపీఎల్ 2022 సీజన్‌లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ రికార్డుకెక్కాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న ఉమ్రాన్.. నిలకడగా గంటకు 150 కిలోమీట్ల వేగంతో బంతులను సంధిస్తూ అందరి దృష్టి ఆకర్షించాడు. అయితే గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం ఈ యువ పేసర్ తేలిపోయాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఎంతలా అంటే? మ్యాచ్‌లో అతను వేసే ఫస్ట్ ఓవర్‌లోనే 15-20 పరుగుల్ని రాబట్టేలా ప్రత్యర్థి జట్లు ప్లాన్‌లు వేస్తున్నాయి. అలా అయితేనే అతడ్ని ఒత్తిడిలోకి నెట్టగలగమని భావిస్తున్నాయి. ఈ ప్లాన్‌తో సక్సెస్ అయిన జట్లు కూడా ఉన్నాయి.

ఎడ్జ్ తాకి సిక్స్..
ఫస్ట్ ఓవర్‌లోనే ఓ 15-20 పరుగులు ఇవ్వగానే మాలిక్ ఒత్తిడికి గురై.. ఆ తర్వాత కూడా ధారాళంగా పరుగులివ్వడం పరిపాటిగా మారిపోయింది. దాంతో.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కనీసం అతని 4 ఓవర్ల బౌలింగ్ కోటాని కూడా పూర్తి చేయించే సాహసం చేయడం లేదు. ఓ రెండు ఓవర్లు వేయగానే బౌలింగ్ నుంచి పూర్తిగా తప్పించేస్తున్నాడు. ఒక్కోసారి అతని వేగం కూడా శాపంలా మారిపోతోంది. బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకున్నా.. సిక్స్‌గా వెళ్లి గ్యాలరీలో పడుతోంది.

డేల్ స్టెయిన్ సూచనలతో..
ముంబైతో మ్యాచ్‌లో మాత్రం ఉమ్రాన్ మాలిక్ వేగంగా తప్పిదాల్ని దిద్దుకున్నాడు. ఓ ప్రమాదకర బీమర్ విసిరి.. నోబాల్ వేయాల్సి వచ్చినా.. ఆ తర్వాత లయను అందుకొని మూడు వికెట్లు పడగొట్టాడు. తమ కోచ్ డేల్ స్టెయిన్ ఇచ్చిన సూచనలతోనే కట్టడిగా బౌలింగ్ చేశానని ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. 'నేను మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో మూడు గంటలు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తే.. ఆ మూడు గంటలు కూడా డేల్ స్టెయిన్ ) నా వెనుకే ఉండి నాకు సలహాలు, సూచనలు చేశాడు'' అని ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. కీలక మ్యాచ్‌ల ముందు మాలిక్ లయ అందుకోవడం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications