Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘క్షమించండి వదినమ్మ’.. హార్దిక్ సతీమణి నటాషాకు దండం పెట్టిన ఉమ్రాన్ మాలిక్!

 Umran Malik Says Sorry To Hardik Pandya Wife Natasha Stankovic After Injuring Him
Photo Credit: twitter

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దుమ్మురేపుతున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. కెరీర్‌లో తొలిసారి(5/25) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ కోల్పోయిన ఐదు వికెట్లను తానే ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో నాలుగు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం.టెక్నిక్‌లో తిరుగులేని శుభమన్ గిల్‌.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యా.. విధ్వంసకర మిల్లర్‌.. సన్‌రైజర్స్ బౌలర్లందరిని ఉతికారేసిన సాహాలను ఉమ్రాన్ తన వేగవంతమైన బంతులతో పెవిలియన్ చేర్చాడు.

హార్దిక్‌కు గాయం..

ఇందులో హార్దిక్ మినహా మిగతా నలుగురు ఉమ్రాన్ బంతులకు క్లీన్ బౌల్డ్ అయ్యారు. అయితే అతని ఇతర బౌలర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ మాజీ ప్లేయర్లు రషీద్ ఖాన్, వృద్దిమాన్ సాహాలు సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగారు. అయితే ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ వేసిన రాకాసి బౌన్సర్‌కు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గాయమైంది.

బలంగా తాకిన బౌన్సర్

బలంగా తాకిన బౌన్సర్

మాలిక్ వేసిన షార్ట్ పిచ్ బాల్ సుమారు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి హార్దిక్ పాండ్యా భుజానికి తగిలింది. దాంతో హార్దిక్ నొప్పితో విలవిలలాడాడు. దాదపు మాలిక్ బంతులకు భయపడ్డ హార్దిక్.. అతని మరుసటి ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. డగౌట్ చేరిన తర్వాత కూడా హార్దిక్ నొప్పితో అసౌకర్యంగానే కనిపించాడు.అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లను ఉమ్రాన్ మాలిక్ కలిసాడు. ఈ ముగ్గురు మైదానంలో సరదాగా మాట్లాడుకున్నారు.

నటాషకు దండం పెడుతూ..

నటాషకు దండం పెడుతూ..

ఈ సందర్భంగా తాను వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు ఉమ్రాన్ క్షమాపణలు కూడా చెప్పినట్లున్నాడు. అంతటితో ఆగకుండా గ్యాలరీలో ఉన్న హార్దిక్ పాండ్యా సతీమణి నటాషకు కూడా ఉమ్రాన్ దండం పెడుతూ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మాములుగా మాట్లాడుతుండగా.. హార్దిక్ తన సతీమణి, కొడుకు గ్యాలరీలో ఉన్నారని ఉమ్రాన్‌కు చూపించాడు. దానికి ఉమ్రాన్ నటాషాకు చేతులు జోడించి నమస్కరించాడు. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

 8 మ్యాచ్‌లు.. 15 వికెట్లు..

8 మ్యాచ్‌లు.. 15 వికెట్లు..

ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నటరాజన్ సైతం 15వికెట్లతో ఉమ్రాన్‌తో సమానంగా ఉన్నా ఎకానమీ ఉమ్రాన్‌దే బెటర్‌గా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో 4ఓవర్లలో 5వికెట్లు తీసిన మాలిక్ 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో బెస్ట్ ఎకానమీతో పలు రికార్డులను నమోదు చేసుకున్నాడు.ఈ సీజన్‌లో 5 వికెట్ల ఘనతను అందుకున్న తొలి పేసర్‌గా నిలిచాడు.

Story first published: Thursday, April 28, 2022, 20:32 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+