Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Umran Malik: డేల్ స్టెయిన్ సెలెబ్రేషన్స్‌తో కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ హల్‌చల్!

Umran Malik Replicates Dale Steyn Celebration style after picking the wicket

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ దుమ్మురేపుతున్నాడు. అత్యంత వేగవంతమైన బంతులతో బ్యాటర్లను గడగడలాడిస్తున్న ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. గుజరాత్‌ టైటాన్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనతను కూడా అందుకున్నాడు. ఉమ్రాన్‌కు కెరీర్‌లో ఇదే ఫస్ట్ ఫైవ్ వికెట్ హాల్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసిన 5 వికెట్లు ఉమ్రాన్ మాలిక్‌వే కావడం విశేషం కాగా.. ఇందులో నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ కావడం మరో విశేషం.

టెక్నిక్‌లో తిరుగులేని శుభమన్ గిల్‌.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యా.. విధ్వంసకర మిల్లర్‌.. సన్‌రైజర్స్ బౌలర్లందరిని ఉతికారేసిన సాహాలను ఉమ్రాన్ తన వేగవంతమైన బంతులతో పెవిలియన్ చేర్చాడు. ఇందులో హార్దిక్ మినహా మిగతా నలుగురు ఉమ్రాన్ బంతులకు క్లీన్ బౌల్డ్ అయ్యారు. గుజరాత్‌ టైటాన్స్‌లో కాస్త ఆశలు రేగిన ప్రతిసారీ ఉమ్రాన్‌ వచ్చాడు.

Umran Malik Replicates Dale Steyn Celebration style after picking the wicket

తన బుల్లెట్‌ బంతులతో ఆ ఆశల్ని తుంచేశాడు. కానీ అతడి కోటా అయిపోయింది. హైదరాబాద్‌ కొంప మునిగింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను హైదరాబాద్ చేజేతులా చేజార్చుకుంది. ఇతర బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఆఖరి బంతికి సిక్స్ బాది మరో థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. మ్యాచ్ చేజారినా ఉమ్రాన్ మాలిక్ స్టన్నింగ్ పెర్పామెన్స్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. ఉమ్రాన్ సంచలన ప్రదర్శన పట్ల ఆ జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ తెగ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇక ఉమ్రాన్ సైతం తాను వికెట్ తీసిన ప్రతీసారి డేల్ స్టెయిన్ సెలెబ్రేషన్స్ గుర్తు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. డేల్ స్టెయిన్ తాను ఆడుతున్నప్పుడు వికెట్ తీస్తే గాల్లోకి పంచ్‌లు ఇస్తూ సంబరాలు చేసుకునేవాడు. తాజాగా ఉమ్రాన్ మాలిక్ సైతం డేల్ స్టెయిన్‌ మాదిరి గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. దాంతో ఈ రెండు సెలెబ్రేషన్స్‌ను పొల్చుతూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నటరాజన్ సైతం 15వికెట్లతో ఉమ్రాన్‌తో సమానంగా ఉన్నా ఎకానమీ ఉమ్రాన్‌దే బెటర్‌గా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో 4ఓవర్లలో 5వికెట్లు తీసిన మాలిక్ 25పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Story first published: Thursday, April 28, 2022, 15:48 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+