For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Umran Malik అరుదైన ఘనత.. అరంగేట్రంలో అదరగొట్టిన‌ సన్‌రైజర్స్ బౌలర్

Umran Malik of SRH bowls at over 150kph, fastest ball by Indian in IPL 2021
IPL 2021 : SRH's Umran Malik Bowls Fastest Ball In IPL 2021 On Debut || Oneindia Telugu

దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ జమ్మూ కాశ్మీర్ బౌలర్.. తన ఫస్ట్ మ్యాచ్‌లోనే రికార్డు ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన భారత బౌలర్‌గా గుర్తింపుపొందాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఓవర్‌‌లో మూడో బంతిని ఉమ్రాన్‌ గంటకు 150 కిమీ వేగంతో విసిరాడు.

తొలి భారత బౌలర్‌గా..

ఈ వేగమంతమైన బంతికి శుభ్‌మన్ గిల్ బిత్తరపోయాడు. భారత్‌ తరపున ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన జాబితాలో ఉమ్రాన్‌ తొలి స్థానంలో​ నిలవగా.. మహ్మద్‌ సిరాజ్‌- ఆర్‌సీబీ (గంటకు 147.68కిలోమీటర్లు, 147.67కిలోమీటర్లు) రెండోస్థానంలో.. ఖలీల్‌ అహ్మద్‌( గంటకు 147.38కిమీ) మూడో స్థానంలో ఉన్నాడు. ఉమ్రాన్ వేసిన ఆ నాలుగో ఓవర్‌లో వరుసగా గంటకు 145, 141.5, 150, 147, 143, 141 కిలోమీటర్ల వేగంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అతను వేసిన తొలి రెండు ఓవర్లలో 10 బంతులు 141 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో విసిరాడు.

వచ్చే సీజన్‌లో కోట్లే..

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ మాలిక్ 6.75 సగటుతో 27 పరుగలిచ్చాడు. వికెట్లు తీయకపోయినా తన భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాడు. నెట్ బౌలర్‌గా యూఏఈకి చేరిన అతను అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వచ్చే ఏడాది మెగావేలంలో ఉమ్రాన్ మాలిక్ భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందు స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ టీ నటరాజన్ కరోనా వైరస్ బారిన పడటంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా నెట్‌ బౌలర్‌గా జట్టులో సేవలందిస్తున్న ఉమ్రాన్ మాలిక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. షార్ట్ టర్మ్ రిప్లేస్‌మెంట్‌గా పేర్కొంది.

శ్రీనగర్‌కు చెందిన..

జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఉమ్రాన్.. రైట్ ఆర్మ్ పేసర్. 21 సంవత్సరాల ఉమ్రాన్ మలిక్ జమ్మూ కాశ్మీర్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లిస్ట్ ఎ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారె ట్రోఫీలో ఆడాడు. మొత్తంగా నాలుగు వికెట్లను పడగొట్టాడు. నటరాజన్ కరోనా వైరస్ బారి నుంచి కోలుకునేంత వరకూ ఉమ్రాన్ మలిక్ జట్టులో కొనసాగుతాడు. ప్రస్తుతం అతను కనబరుస్తున్న ఫామ్ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల్లో అతనే కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈ యువ ఆటగాడి ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

పేలవ బ్యాటింగ్..

పేలవ బ్యాటింగ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(26), అబ్దుల్ సమద్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో టీమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 116 పరుగులు చేసి నాలుగు బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 10 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లతో 25) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దినేశ్ కార్తీక్(18 నాటౌట్) బౌండరీతో విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్ తలో వికెట్ తీశారు.

Story first published: Monday, October 4, 2021, 11:09 [IST]
Other articles published on Oct 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+