Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమ్రాన్‌ మాలిక్‌కు ఘన స్వాగతం.. తండ్రికి కాస్ట్‌లీ కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన సన్‌రైజర్స్ సెన్సేషన్!

 Umran Malik Gets Grand Welcome After IPL 2022 And He Gifts A Car For His Dad

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్‌కు హోమ్ టౌన్‌లో ఘన స్వాగతం లభించింది. సన్‌రైజర్స్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడంతో ఉమ్రాన్ మాలిక్ మంగళవారం తన హోమ్ టౌన్ జమ్మూకు చేరుకున్నాడు. ఇక అతని రాకను తెలుసుకున్న అక్కడి ప్రజలు ఉమ్రాన్ మాలిక్‌కు ఘన స్వాగతం పలికారు. భారీ ప్లకార్డుల ఏర్పాటు చేయడంతో పాటు ర్యాలీ తీసారు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ 21 వికెట్లతో సత్తా చాటిన విషయం తెలిసిందే.

టీమిండియాలోకి..

టీమిండియాలోకి..

ఈ ప్రదర్శనతో సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్.. అతి త్వరలోనే భారత తరఫున అరంగేట్రం చేయనున్నాడు. దాంతో అతని సక్సెస్‌ను జమ్మూ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఇక ఉమ్రాన్ మాలిక్.. తన తండ్రికి థార్ కార్ కొనిచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ సందర్భంగా ఉమ్రాన్ తండ్రి రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు. 'ఉమ్రాన్.. టీమిండియాకు ఎంపికయ్యాడనే వార్తను నా మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకున్నాను. ఉమ్రాన్ టీమిండియా పిలుపు అందుకున్నాడని చాలా మంది నాకు అభినందనలు తెలిపారు.

నా పాత్ర ఏం లేదు..

నా పాత్ర ఏం లేదు..

యావత్ దేశం ఉమ్రాన్‌కు మద్దతుగా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఉమ్రాన్ సక్సెస్‌లో నా పాత్ర ఏ మాత్రం లేదు. ఎదో ఒక రోజు సక్సెస్ అవుతానని తనపై తాను నమ్మకంగా ఉన్నాడు. చాలా కష్టపడుతూ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. దేవుడి ఆశిస్సులతో అతను ఒక్కడే తీవ్రంగా కష్టపడి సక్సెస్ అందుకున్నాడు. అతని సక్సెస్‌ నేపథ్యంలో నాకు వస్తున్న అభినందనలకు నేను అనర్హుడిని.

సహజంగానే..

సహజంగానే..

ఉమ్రాన్ మాలిక్ ఎలాంటి జిమ్‌కు వెళ్లకుండా సహజంగానే ఫిట్‌నెస్ సాధించాడు. మా ఇళ్లు తావి నది ప్రాంతంలో ఉంటుంది. ఉమ్రాన్ తన బాల్యాన్ని ఆ నది సమీపంలోని ఇసుక ప్రాంతంలో గడిపాడు.అక్కడే పరుగెడుతూ.. క్రికెట్ ఆడాడు. దాంతో అతను ఎలాంటి జిమ్‌కు వెళ్లకుండా ధృడంగా తయ్యారయ్యారు. అతని లోయర్ బాడీ చాలా బలంగా ఉంటుంది. ఉమ్రాన్ తన ఐపీఎల్ సంపాదనతో నాకు కారు కొనిచ్చాడు. ఉమ్రాన్‌ను మేం చాలా గారాబంగా పెంచాం. మా కష్టాల గురించి ఏనాడు అతనికి చెప్పలేదు. ఏది అడిగితే అది మాకు సాధ్యమైనంతమేరకు తెచ్చిచ్చాం. నాకంటే వాళ్ల అమ్మ చాలా సపోర్ట్‌గా ఉండేది.'జమ్మూలో పండ్లు, కూరగాయాల షాప్ నడిపే రషీద్ తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌‌లో అతను ఆడే ఫస్ట్ మ్యాచ్‌కు తాము హాజరవుతామని మాలిక్ తెలిపాడు.

Story first published: Thursday, May 26, 2022, 14:26 [IST]
Other articles published on May 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+