Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: దేవుడా.. గంటకు 154 కి.మీ వేగంతో బౌలింగ్.. రికార్డు సృష్టించిన ఉమ్రాన్ మాలిక్!

Umran Malik bowls the fastest ball

పుణే: ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేస్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ త‌న బౌలింగ్‌లోని వేగంతో బ్యాట‌ర్ల‌ను వ‌ణికిస్తున్నాడు. 150 కిలో మీట‌ర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తూ బ్యాట‌ర్ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్.. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇప్పటికే ఈ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ డెలివరీలు వేసిన ఉమ్రాన్ మాలిక్.. తన రికార్డునే మెరుగుపరుచుకున్నాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన అత్య‌ధిక వేగ‌వంత‌మైన బాల్ 153.3 ఉమ్రాన్ మాలిక్ పేరు మీద‌నే ఉండగా.. ఇటీవల ఫెర్గూసన్ దాన్ని 153.9 కిలో మీటర్ల వేగంతో అధిగమించాడు. తాజాగా ఉమ్రాన్ మాలిక్ 154 కిలోమీటర్ల వేగంతో టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు.

ఇలా త‌న ఎక్స్‌ప్రెస్‌ వేగంతో ఉమ్రాన్ మాలిక్‌ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ డెలివ‌రీ అవార్డుల‌ను గెలుచుకోవ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ మాలిక్ 7 ఫాస్టెస్ట్ అవార్డుల‌ను గెలుచుకున్నాడు. ప‌రిస్థితి చూస్తుంటే ఈ ఏడాది ఆడే అన్ని మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివ‌రీ అవార్డుల‌ను గెలుచుకునేలా ఉన్నాడు. కాగా జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్.. నెట్ బౌలర్‌గా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా వచ్చిన అవకాశంతో చెలరేగిపోతున్నాడు.

దుబాయ్ వేదికగా జరిగిన గత సీజన్ సెకండాఫ్‌లో నటరాజన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ వేగవంతమైన బంతులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సారి మరింత మెరుగైన అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను తన పేస్‌తో భయపెడుతున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో చెన్నై బ్యాటర్లు చెలరేగారు.

ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 99), డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్) భారీ ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రుతురాజ్ తృటి‌లో సెంచరీ చేజార్చుకున్నా.. కాన్వేతో కలిసి తొలి వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఈ ఇద్దరి ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.

Story first published: Sunday, May 1, 2022, 22:22 [IST]
Other articles published on May 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+