టీమిండియాలో అతను చాలా తెలివైనోడు: అంపైర్ అనిల్ చౌదరి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అంపైర్ అనిల్ చౌదరి ప్రశంసల జల్లు కురిపించాడు. అతని బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుందని కొనియాడాడు. హిట్‌మ్యాన్ చాలా తెలివైన ఆటగాడని కితాబిచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'చూడటానికి సాధారణంగా కనిపించినా.. రోహిత్ శర్మ చాలా తెలివైన ఆటగాడు. ఆట పట్ల అతనికి చాలా పరిజ్ఞానం ఉంది. హిట్‌మ్యన్ ఇంటెలిజెంట్ ప్లేయర్. అతని బ్యాటింగ్ చూడ ముచ్చటగా ఉంటుంది. రోహిత్ సహజమైన ఆటగాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతనికి బంతిని పసిగట్టే నైపుణ్యం ఉంది.

అతను పుల్ షాట్ ఆడే విధానం అమోఘం. అతను 200 ప్లస్ రన్స్ చేస్తే.. యార్కర్లను కూడా అలవోకగా సిక్సర్లుగా మార్చగలడు. అతను అసాధారణమైన బ్యాటర్. అతని బ్యాటింగ్ సంగీతంలా ఉంటుంది. అతను ఒన్‌మ్యాన్ ఆర్మీ ప్లేయర్. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంపైరింగ్ చేయడం ఈజీగా ఉంటుంది.
అతను ఔట్ లేదా నాటౌట్‌గా నిలుస్తాడు. ఔటైనా ఎలాంటి అయోమయం లేకుండా వెనుదిరుగుతాడు. అంపైర్లు ఇబ్బందికి గురయ్యేలా అతని ఆట ఉండదు. అతని ఫుట్‌వర్క్ అద్భుతంగా ఉంటుంది. అతను పదే పదే ముందుకొచ్చి ఏమాత్ర ఆడడు. అతను బ్యాక్ ఫుట్‌లోనే నిల్చొని బంతి కోసం వెయిట్ చేసి ఆడుతాడు. బంతికి తగ్గట్లు కదులుతూ షాట్స్ కొడుతాడు.

నేను టీవీ అంపైర్‌గా ఉన్నప్పుడు రోహిత్ డబుల్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో యార్కర్లను కూడా రోహిత్ సిక్సర్లుగా తరలించాడు. అతను సీమ్ బౌలింగ్‌ను లేజీగా ఆడినా.. అతని దగ్గర విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి.'అని అనిల్ చౌదరి చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications