Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమేశ్​ ఔట్.. టెస్టుల్లో నటరాజన్ ఆరంగేట్రం!! గాయాలు నట్టూకి కలిసొచ్చాయి!

Umesh Yadav out of 3rd Test, T Natarajan likely to his Test debut for India

ముంబై: భారత పేస్ ‌బౌలర్లు ఒక్కొక్కరుగా గాయాల బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇషాంత్ శర్మ‌, భువనేశ్వర్‌ కుమార్‌ గాయాల కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కాగా.. ఆస్ట్రేలియా‌తో జరిగిన తొలి టెస్టులో గాయపడిన స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ఇక బాక్సింగ్‌ డే టెస్టులో బౌలింగ్‌ చేస్తుండగా.. మరో పీసర్ ఉమేశ్‌ యాదవ్‌ గాయపడ్డాడు. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేస్తుండగా.. పిక్క కండరం పట్టేయడంతో ఉమేష్ మైదానాన్ని వీడాడు. మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉండటం కూడా అనుమానమేనని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఉమేశ్‌ స్థానంలో నటరాజన్:

ఉమేశ్‌ స్థానంలో నటరాజన్:

తాజాగా ఉమేష్ యాదవ్ స్కానింగ్‌ రిపోర్టులు వచ్చాయి. అతడికి విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్టు సమాచారం. దీంతో మూడో టెస్టుకు ఉమేష్ దూరం కానున్నాడు. ఉమేశ్‌ స్థానంలో యార్కర్‌ స్పెషలిస్ట్‌ టీ నటరాజన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే నిజమయితే నటరాజన్‌.. భారత్ తరఫున టెస్టుల్లో కూడా ఆరంగేట్రం చేయనున్నాడు. సుదీర్ఘ ఆసీస్ పర్యటనలోనే వన్డే, టీ20ల్లో నటరాజన్‌ ఆరంగేట్రం చేశాడు.

 నాలుగో టెస్టుకు ఉమేష్?:

నాలుగో టెస్టుకు ఉమేష్?:

జనవరి 15న చివరిదైన నాలుగో టెస్టు ఆరంభం కానుంది. అప్పటి వరకు రెండు వారాల కన్నా ఎక్కువ సమయం ఉండటంతో చివరి టెస్టులో ఉమేష్ యాదవ్ మళ్లీ ఆడుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. క్రిస్మ‌స్‌కు ముందు సిడ్నీలో క‌రోనా కేసులు పెర‌గ‌డంతో మ్యాచ్‌ను నిర్వ‌హించాలా వ‌ద్దా అన్న సందిగ్ధంలో ప‌డింది క్రికెట్ ఆస్ట్రేలియా. స్టాండ్‌బైగా మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సిద్ధంగా ఉంచింది. అయితే న్యూసౌత్ వేల్స్‌, క్వీన్స్‌ల్యాండ్ ప్ర‌భుత్వాల‌తో చ‌ర్చించిన త‌ర్వాత మ్యాచ్‌ను సిడ్నీలోనే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఏ తాత్కాలిక సీఈవో నిక్ హాక్‌లీ తెలిపారు.

 గాయాలు కలిసొచ్చాయి:

గాయాలు కలిసొచ్చాయి:

బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో టీ నటరాజన్ ఐపీఎల్ 2020లో ఆకట్టుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటన కోసం తొలుత నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఇక వరుణ్ చక్రవర్తి గాయంతో నటరాజన్‌కు టీ20ల్లో అవకాశం దక్కింది. ఆ తర్వాత నవదీప్ సైనీ ఇంజ్యూరీతో వన్డేల్లో చోటు దొరికింది. ఇప్పుడు ఉమేష్ గాయంతో టెస్టుల్లో కూడా చోటు దక్కనుంది. మొత్తానికి భారత బౌలర్ల గాయాలు నటరాజన్‌కు కలిసొచ్చాయనే చెప్పాలి.

 అరంగేట్రంలోనే అదుర్స్:

అరంగేట్రంలోనే అదుర్స్:

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న నటరాజన్.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్‌ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు. ఈ సూపర్ ఫెర్ఫామెన్స్‌తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు. తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. మూడో టీ20లో నాలుగు ఓవర్లలో కేవలం 33 పరుగులు ఇచ్చి ఒక విక్కెట్ తీశాడు.

రిషబ్ పంత్ అరుదైన ఘనత.. ఆస్ట్రేలియాలో ఆ రికార్డు ఎవరికీ లేదు!!

Story first published: Tuesday, December 29, 2020, 19:49 [IST]
Other articles published on Dec 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+