Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రిషభ్ పంత్‌ను ఊర్వశీ రౌటేలా వదిలేసింది.. ఉమైర్ సంధు సంచలన ట్వీట్!

న్యూఢిల్లీ: సినీ హీరో, హీరోయిన్‌ల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన గాసిప్స్ షేర్ చేసే ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ ఉర్వశీ రౌటేలాతో రిషభ్ పంత్ రిలేషన్ కొనసాగకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

రిషభ్ పంత్, ఊర్వశీ రౌటేలా మధ్య బంధం పడక గది వరకు కొనసాగిందని, దుబాయ్‌లోని పాలాజ్జో వెర్సెస్ హోటల్‌లో ఈ ఇద్దరూ తరుచు కలుసుకునేవారని తెలిపాడు. ఊర్వశీ రౌటేలా అడిగిన ఖరీదైన బహుమతులను రిషభ్ పంత్ ఇవ్వలేకపోయాడని, ఆమె కోరికలను తీర్చలేకపోయాడని, దాంతో అతన్ని వదిలేసిందని పేర్కొన్నాడు. డబ్బులు ఉన్నవారితోనే ఊర్వశి రౌటేలా తిరుగుతుందని ట్వీట్ చేశాడు.

Umair Sandhu reveals the reason why Urvashi Rautela left Rishabh Pant

ప్రస్తుతం ఈ ట్వీట్ భారత క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. సెలెబ్రిటీల గురించి ఏదో గాసిప్ షేర్ చేసే ఉమైర్ సంధు విశ్వసనీయత కోల్పోయినా.. పంత్ గురించి చెప్పిన విషయం నమ్మదగినదిగా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో ఊర్వశి రౌటేలానే పంత్ తన కోసం హోటల్ గదికి వచ్చాడని, తనతో పడక సుఖం కోరుకున్నాడని ఆరోపించింది.

ఈ ఆరోపణలపై పంత్ ఘాటుగా బదులివ్వడంతో వీరి మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మాటల యుద్దమే నడిచింది. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో ఊర్వశి రౌటేలా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే వీరి మధ్య మాటల యుద్దాన్ని ప్రస్తావిస్తూ ఉమైర్ సంధు చెప్పిన విషయం నిజమేనంటూ కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరికొందరు మాత్రం ఉమైర్ సంధు చెప్పేవన్నీ గాలి మాటలేనని కొట్టిపారేస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, అతనికి డోపింగ్ టెస్ట్ చేయాలని కూడా ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. అంతకుముందు రోహిత్ శర్మ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ట్వీట్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా.. అత్యంత ఖరీదైన వేశ్య అని చెప్పాడు.

పెళ్లికి ముందు భారత్‌లో ఉన్న బిగ్ పొలిటిషన్స్, బిజినెస్‌మ్యాన్స్‌తో పడుకుందని, కన్నింగ్ లేడీ అని ఆరోపించాడు. ఎప్పుడూ ఏదో గాసిప్ వార్తను షేర్ చేసే ఉమైర్ సంధును జనాలు కూడా లైట్ తీసుకున్నారు.

Story first published: Wednesday, June 28, 2023, 21:40 [IST]
Other articles published on Jun 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+