
పుణే: అల్టిమేట్ ఖో ఖో లీగ్ ఆరంభ సీజన్ టైటిల్‌కు తెలుగు యోధాస్ అడుగు దూరంలో నిలిచింది. గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 23 పాయింట్ల తేడాతో తెలుగు యోధాస్ అద్భుత విజయాన్నందుకుంది. ఆరంభం నుంచి దూకుడు కనబర్చిన తెలుగు యోధాస్ 67-44 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఓడిశా జాగర్‌నట్స్‌తో తెలుగు యోధాస్ అమీతుమీ తేల్చుకోనుంది.
క్వాలిఫయర్1 మ్యాచ్‌లో ఒడిశా చేతిలో ఓడిన తెలుగు యోధాస్ మరోసారి ఆ జట్టుతోనే తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మూడో టర్న్‌లో గుజరాత్ జెయింట్స్ పోరాడినా ఫలితం లేకపోయింది. అభినందన్ పాటిల్ ఏకంగా 4.26 నిమిషాలు తప్పించి 8 బోనస్ పాయింట్లు సాధించి పెట్టినా కోలుకోలేకపోయింది. చివరి టర్న్‌లో తెలుగు యోధాస్ దుమ్మురేపి 61-29తో గెలుపొందింది.
సీజన్-1లో 100 డిఫెండింగ్ పాయింట్స్ సాధించిన తొలి జట్టుగా తెలుగు యోధాస్ టీమ్ నిలిచింది. తొలి టర్న్‌లో 37 పాయింట్లతో సత్తా చాటిన తెలుగు యోధాస్.. ప్రత్యర్థికి 13 పాయింట్లు మాత్రమే ఇచ్చింది. పవర్ ప్లేలో గుజరాత్ అటాకింగ్ చేసినా.. దీపక్ మాధవ్ 2 నిమిషాల 46 సెకండ్లతో డిఫెండ్ చేశాడు. రెండు బోనస్ పాయింట్లు సాధించిపెట్టాడు. రెండో టర్న్‌లో గుజరాత్ 21 పాయింట్లు సాధించడంతో ఫస్టాఫ్ ముగిసేసరికి తెలుగు యోధాస్ 39-21తో లీడ్‌లో నిలిచింది. ఇంటిబాట పట్టిన గుజరాత్ జెయింట్స్ రూ.30 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. టైటిల్ గెలిచిన జట్టుకు కోటీ రూపాయల నజరానా ఇవ్వనున్నారు. రన్నరప్‌కు రూ.50 లక్షలు దక్కనున్నాయి.