Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైన్యంలో చేరుతున్న ఉక్రెయిన్ అథ్లెట్లు.. రష్యాతో యుద్దానికి సై!

Ukrainian athletes join military after Russian invasion

వాషింగ్టన్‌: ఇన్నాళ్లూ మైదానంలో తమ క్రీడానైపుణ్యాలను ప్రదర్శించిన ఉక్రెయిన్‌ అథ్లెట్లు ఇప్పుడిక తమ దేశాన్ని రక్షించుకునే పనిలో పడ్డారు. తమపై రష్యా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఆ దేశ సైనికులతో తలపడేందుకు సిద్ధమయ్యారు. రెండు వారాల క్రితం చైనాలోని బీజింగ్‌లో ముగిసిన వింటర్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ బయథ్లాన్‌ (స్కీయింగ్‌, షూటింగ్‌ కలిపి ఆడే క్రీడ) అథ్లెట్‌ దిమిత్రో పిడ్రుచ్ని.. ప్రస్తుతం మిలటరీ యూనిఫాం ధరించి తుపాకీ చేతపట్టాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'ప్రస్తుతం నేను నా స్వస్థలం టెర్నోపిల్‌లో ఉక్రెయిన్‌ సైన్యంతో కలిసి దేశ సేవ చేస్తున్నా. ఎయిర్‌ అలారమ్‌ సందర్భంగా తీసుకున్నదే ఈ ఫొటో'అని క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. బయథ్లాన్‌ (స్కియింగ్‌, షూటింగ్‌) ప్రపంచ ఛాంపియన్‌ దిమిత్రో మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాడు. వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొని గతవారమే బీజింగ్‌ నుంచి ఉక్రెయిన్‌ తిరిగొచ్చాడు.

ఇక, ఉక్రెయిన్‌ టెన్నిస్‌ మాజీ ఆటగాడు సెర్జీ స్టాఖోవిస్కీ కూడా ఇప్పుడు తమ దేశం కోసం పోరుబాటలో నడుస్తున్నాడు. వృత్తిపరంగా హంగేరీలో నివాసముంటున్న స్టాఖోవిస్కీ.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కామెంటేటర్‌గానూ పనిచేశాడు. ఆ టోర్నీ ముగిసిన వెంటనే స్వదేశం చేరుకొని ఆర్మీలో చేరాడు. ప్రపంచ బాక్సింగ్‌ మాజీ ఛాంపియన్‌ వెసిల్‌ లొమచెంకో, హెవీ వెయిట్‌ ప్రపంచ మాజీ ఛాంపియన్‌ ఒలెగ్జాండర్‌ యుసిక్‌లు ఆయుధాలు చేపట్టి దేశ రక్షణలో పాల్గొంటున్నారు.

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే ఇరువైపుల వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోగా.. దాడుల్లో ఉక్రెయిన్‌ సామాన్య పౌరులు కూడా చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఈయూకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక విధానం ద్వారా అది సాధ్యమేనన్నారు. మరోవైపు ఆయుధాలను వీడి వెనక్కి వెళ్లిపోవాలని.. తద్వారా రష్యా సైనికులు తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు ప్రారంభమయ్యే ముందు జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

Story first published: Thursday, March 3, 2022, 12:34 [IST]
Other articles published on Mar 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+