Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదో తుపాస్ మ్యాచ్.. దానికి కొట్టుకోవడం ఏంటి బ్రో! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు కొట్టుకున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌‌కు హాజరైన ప్రేక్షకులు గొడవపడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. కుర్చీల నుంచి ఒకరినొకరు తోసేసుకున్నారు. ఇతర అభిమానులు జోక్యం చేసుకొని గొడవను ఆపారు.

ఒకరినొకరు తోసుకోవడంతో అభిమానులకు స్వల్ప గాయాలయ్యాయి. గొడవ ఏ విషయంలో జరిగింది అనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'అదో తుపాస్ మ్యాచ్.. దానికి కొట్టుకోవడం ఏంటి బ్రో'అని సెటైర్లు పేల్చుతున్నారు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Ugly Fan Brawl Erupts at Ekana Stadium During LSG vs RR IPL 2026 Clash Viral Video Sparks Outrage

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/30), ప్రిన్స్ యాదవ్(2/29), మోహ్‌సిన్ ఖాన్(2/17) రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్(22), హిమ్మత్ సింగ్(15) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆయుష్ బదోని(0), రిషభ్ పంత్(0), ఎయిడెన్ మార్క్‌రమ్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/20) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/27), బ్రిజేష్ శర్మ(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.

లక్నో సూపర్ జెయింట్స్‌ వరుసగా నాలుగు పరాజయాలను మూటగట్టుకొని ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుంది. దాంతో పాయింట్స్ టేబుల్‌తో 9వ స్థానానికి పడిపోయింది. కెప్టెన్ రిషభ్ పంత్‌తో పాటు ఏ ఒక్క ఆటగాడు రాణించడం లేదు.

Story first published: Thursday, April 23, 2026, 16:58 [IST]
Other articles published on Apr 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+