అందుకే ఓడాం: భారత కెప్టెన్ ఉదయ్ సహారన్
చెత్త షాట్లు ఆడటంతో పాటు ఓపికగా బ్యాటింగ్ చేయకపోవడం తమ ఓటమిని శాసించిందని టీమిండియా అండర్ 19 కెప్టెన్ ఉదయ్ సహారన్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 79 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది. కానీ కీలక పోరులో ఒత్తిడిని తట్టుకోలేక ఓటమికి తల వంచింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం స్పందించిన భారత కెప్టెన్ ఉదయ్ సహారన్.. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడం ఓటమిని శాసించిందన్నాడు. 'మా కుర్రాళ్ల పోరాట పటిమ పట్ల గర్వంగా ఫీలవుతున్నా. విజయం కోసం ఆఖరి వరకు పోరాడారు. ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్‌లో మేం కొన్ని చెత్త షాట్లు ఆడాం. మిడిలార్డర్‌లో ఓపికగా బ్యాటింగ్ చేయలేకపోయాం.

కాస్త సమయం తీసుకొని ఆడలేకపోయాం. ఫైనల్ ఒత్తిడికి అనుగుణంగా మేం సన్నదమయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. ఈ టోర్నీ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మ్యాచ్‌ల సందర్భంగా సపోర్ట్ స్టాఫ్ మా భవిష్యత్తుకు ఉపయోగపడే ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇలానే పాఠాలు నేర్చుకుంటూ ఆటలో మరింత మెరుగయ్యే ప్రయత్నం చేస్తాం.'అని ఉదయ్ సహారన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హ్యూ వీబ్జెన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 48), ఓలివర్ పీక్(43 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 46 నాటౌట్), హ్యారీ డిక్సాన్(56 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో రాజ్ లింబానీ(3/38) మూడు వికెట్లు తీయగా.. నమాన్ తీవారీ(2/63), సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. లీగ్ దశలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(22), సచిన్ దాస్(9), కెప్టెన్ ఉదయ్ సహరణ్(8) దారుణంగా విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్‌మన్(3/15), రాఫ్ మెక్‌మిలన్(3/43) మూడేసి వికెట్లు తీయగా.. కల్లమ్ విడ్లేర్(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. చార్లీ అండర్సన్, టామ్ స్ట్రేకర్ చెరో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications