
కోహ్లీ భాయ్‌తో మాట్లాడటం..
‘విరాట్ కోహ్లీ భాయ్‌తో మాట్లాడటం గొప్పగా అనిపించింది. క్రికెట్ గురించే కాదు జీవితం గురించి ఆయన చెప్పిన కీలక విషయాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ స్ట్రేలియాతో సెమీఫైనల్లో సెంచరీ చేయడం గర్వకారణం. రషీద్, నేను చివరి వరకూ బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఆ ప్రణాళిక ఫలితాన్నిచ్చింది. నిలకడగా ఆడి ఇన్నింగ్స్ నిలబెట్టాలనుకున్నాం. మరీ ఎక్కువ షాట్లు ఆడకుండా 40వ ఓవర్ దాటేంత వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. రషీద్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు.
గర్వంగా ఉంది..
మా జోడీ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మేం ఇద్దరం కలిస్తే మెరుగ్గా రాణిస్తామని తెలుసు. ఇప్పుడదే జరిగింది. అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా నిలవడం నాకు గర్వకారణం" అని యశ్ ధుల్ చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ ఫైనల్ ముంగిట దిగ్గజ ఆటగాడు విలువైన సలహాలు ఇచ్చాడని స్పిన్నర్ కౌశల్ తంబె పేర్కొన్నాడు. 2008లో కౌలాలంపుర్‌లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
మూడో కెప్టెన్‌గా..
అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన భారత మూడో కెప్టెన్‌గా యశ్ ధుల్ నిలిచాడు. గతంలో కోహ్లీ (2008), ఉన్ముక్త్ చంద్ (2012) ఆ ఘనత సాధించారు. ప్రస్తుతం విండీస్‌లో జరుగుతున్న ఈ కుర్రాళ్ల ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన యువ భారత్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం ఈ టైటిల్ ఫైట్ జరగనుంది. అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడం వరుసగా నాలుగో సారి.


Click it and Unblock the Notifications












