అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 239 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో 48.4 ఓవర్లలో భారత్ 238 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ(67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72), అభిజ్ఞాన్ కుండు(112 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) హాఫ్ సెంచరీలతో రాణించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫర్హాద్(5/38) ఐదు వికెట్లు తీయగా..ఇక్బాల్ హొస్సేన్, అజిజుల్ హకీమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ పర్వేజ్ జిబాన్ తలో వికెట్ తీసారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత అండర్ 19 జట్టుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) తన పేలవ ఫామ్‌ను కొనసాగించగా.. వేదాంత్ త్రివేది గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. బంగ్లా పేసర్ ఫర్హాద్ ఒకే ఓవర్‌లో ఇద్దర్నీ ఔట్ చేసి భారత్‌ను దెబ్బతీసాడు. విహాన్ మల్హోత్ర సాయంతో వైభవ్ సూర్యవంశీ జట్టు స్కోర్‌ను 50 పరుగులు ధాటించాడు. అయితే మల్హోత్ర(7)ను హకీమ్ తమీమ్ ఔట్ చేయగా.. అభిజ్ఞాన్ కుండు సాయంతో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారీ షాట్లతో సెంచరీ దిశగా సాగిన అతన్ని హోస్సేన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. కాన్షిక్ చౌహన్‌తో అభిజ్ఞాన్ కుండు జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. మరోవైపు నిలకడగా ఆడిన కాన్షిక్ చౌహన్‌ను హకీమ్ పెవిలియన్ చేరడంతో భారత్ 173 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి అంబ్రిష్ రాగా.. వర్షం ఆటకు అంతరాయం కలిగించింది.
సుమారు 40 నిమిషాల అంతరాయం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. అబ్రిష్(5) ఔయ్యాడు. ఖిలన్ పటేల్ సాయంతో అభిజ్ఞాన్ జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. ఖిలాన్ పటేల్(8) ఔటైన కాసేపటికే సెంచరీ దిశగా సాగిన అభిజ్ఞాన్ కుండును ఫర్హాడ్ పెవిలియన్ చేర్చాడు. ఆఖరి వికెట్‌కు దిపేష్ దేవండ్రన్(11) వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.