Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup: సెమీఫైనల్లో చెలరేగిన సౌతాఫ్రికా.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

అండర్ 19 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా కుర్రాళ్లు అదరగొట్టారు. లూన్ డ్రీ ప్రిటోరియస్(102 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76), రిచర్డ్ సెలెట్జ్‌వేన్(100 బంతుల్లో 4 ఫోర్లతో 2 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది.

భారత బౌలర్లో రాజ్ లింబాని మూడు వికెట్లు తీయగా.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రెండు. నమన్ తివారీ, సామీ పాండే తలో వికెట్ తీసారు.

 U19 World Cup Semi-Final: Raj Limbani Shines As SA Set 245-Run Target For India

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టుకు ఆరంభంలోనే లింబాని షాకిచ్చాడు. ఓపెనర్ స్టీవ్ స్టోల్క్(14)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. డేవిడ్ టీగర్(0) క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ చేశాడు. దాంతో సౌతాఫ్రికా 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో ఓపెనర్ ప్రిటోరియస్, రిచర్డ్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ప్రిటోరియస్ 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్న అతన్ని ముషీర్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన ఒలివర్‌తో రిచర్డ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

90 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఆచితూచి ఆడాడు. ఓలివర్‌ను ముషీర్ ఖాన్ ఔట్ చేయగా.. డేవాన్(3)ను సౌమీ పాండే పెవిలియన్ చేర్చాడు. క్రీజులోపాతుకుపోయిన రిచర్డ్‌ను నమన్ తివారీ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 244 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆదర్ష్ సింగ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. సూపర్ ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్(4)కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తోంది. సెమీస్ చేరే క్రమంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ యువ భారత్ విజయం సాధించింది.

Story first published: Tuesday, February 6, 2024, 18:09 [IST]
Other articles published on Feb 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+