U19 World Cup: టీమిండియా ఫ్యూచర్ సేఫ్! నిఖార్సైన ఆల్‌రౌండర్ దొరికాడు!

హైదరాబాద్: 'టీమిండియా ఫ్యూచర్ సేఫ్'ఈ మాట అన్నది ఎవరో కాదు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ. అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన యువ ఆటగాళ్లను కొనియాడుతూ ప్రధాని చేసిన వ్యాఖ్య ఇది. టోర్నీలో కుర్రాళ్ల ఆటతీరు అద్భుతమని, భారత క్రికెట్ భవిష్యత్తు.. సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని కితాబిచ్చాడు. ఇక అండర్ 19 ప్రపంచకప్‌లో భారత యువ ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత అందరి అభిప్రాయం ఇదే.
టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్‌క్రిష్ రఘువంశీ, హర్నూర్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్, రాజ్ బావా, విక్కీ ఒస్త్‌వాల్, రవి కుమార్... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు.

ఆల్‌రౌండర్ల దొరికారు..
గత కొన్నేళ్లుగా నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ కోసం టీమిండియా ఎదురుచూస్తోంది. మధ్యలో హార్దిక్ పాండ్యా వచ్చి ఆశలు రేపినా.. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత అతను లయ తప్పాడు. వెంకటేశ్ అయ్యర్ సైతం అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అండర్-19 ప్రపంచకప్‌లో భారత పేస్ ఆల్‌రౌండర్ల ప్రదర్శన ఆశాజనకంగా కనిపిస్తోంది.
రాజ్ బవా, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్.. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్రీడా కుటుంబం నుంచి వచ్చిన 19 ఏళ్ల రాజ్.. లెఫ్టార్మ్ బ్యాటింగ్‌తో, రైటార్మ్ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. ఫైనల్లో 5 వికెట్లతో పాటు 35 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

హంగార్గేకర్ సైతం..
టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలోనే ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా అతనికి పేరొచ్చింది. మరోవైపు కొత్త బంతితో కొన్ని మ్యాచ్‌ల్లో భారత్‌కు చక్కటి ఆరంభాన్నిచ్చిన హంగార్గేకర్.. చివరి ఓవర్లలో మెరుపు హిట్టింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. అతడిలో మంచి వేగం ఉంది. ప్రధాన బ్యాట్స్‌మన్‌కు దీటుగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతడిలో కనిపిస్తోంది.

తెలుగు తేజం రషీద్..
ఓపెనర్లు రాణిస్తేనే జట్టు మంచి స్థితిలో నిలవడం లేదంటే ఓటమి దిశగా సాగడం.. ఇటీవల టీమిండియాకు అలవాటుగా మారింది ! కానీ అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌కు ఆ సమస్యే కలగలేదు. అందుకు కారణం కెప్టెన్ యశ్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్. 3వ స్థానంలో వైస్‌కెప్టెన్ రషీద్ (4 మ్యాచ్‌ల్లో 50.25 సగటుతో 201 పరుగులు), 4వ స్థానంలో యశ్ (4 మ్యాచ్‌ల్లో 76.33 సగటుతో 229) గొప్పగా రాణించారు.
టోర్నీలో తొలి మ్యాచ్ తర్వాత కరోనా కారణంగా తర్వాతి రెండు మ్యాచ్‌లకు వీళ్లు దూరమయ్యారు. ఆత్మవిశ్వాసంతో దాని నుంచి కోలుకుని ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా క్వార్టర్స్‌లో నేరుగా బరిలో దిగినా తిరిగి లయ అందుకున్నారు. సెమీస్‌లో మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ మ్యాచ్‌లో యశ్ శతకం చేయగా.. రషీద్ 94 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

అసలు పరీక్ష ఇప్పుడే..
కుర్రాళ్లకు అసలైన పరీక్ష ఇప్పుడే మొదలు కానుంది. సీనియర్ జట్టు తలుపు తట్టాలంటే వచ్చే కొన్నేళ్లు వీళ్లకు చాలా కీలకం. నిలకడగా ఈ ప్రదర్శన కొనసాగిస్తేనే టీమిండియాలోకి వస్తారు. గతంలోనూ అండర్-19 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించి కనుమరుగైన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. బాబా అపరాజిత్, విజయ్ జోల్, రికీ భుయ్, ఉన్ముక్త్ చంద్, మన్‌జోత్ కల్రా, ప్రియమ్ గార్గ్.. ఇలా కొంతమంది ఆటగాళ్లు అండర్-19 ప్రపంచకప్‌ల్లో అదరగొట్టినా.. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయారు.
మరోవైపు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, కోహ్లీ, జడేజా, పంత్, పృథ్వీ షా, శుభ్‌మన్.. ఇలా జూనియర్ స్థాయి నుంచి సీనియర్ జట్టుకు విజయవంతంగా ఎదిగిన క్రికెటర్లూ ఉన్నారు. కాబట్టి ఈ కుర్రాళ్లను సరైన దిశలో నడిపించడంపై ఇప్పుడు బీసీసీఐ ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications