
దుబాయ్: అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ దుమ్మురేపుతున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన యశ్ ధుల్.. జట్టును ఒంటి చేత్తో ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో యశ్ ధుల్ బాదిన ఏకైక సిక్స్ అందర్నీ ఆకట్టుకుంది. క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరగని రీతిలో యశ్ ధుల్ ఆడిన ఆ సిక్సర్‌కు ఐసీసీ సైతం ఫిదా అయ్యింది. ఆ వీడియోను అభిమానులతో పంచుకున్న ఐసీసీ.. భారత కెప్టెన్‌ను ప్రత్యేకంగా అభినందించింది.
'వాటే హిట్.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పిచ్‌పై డ్యాన్స్ చేస్తూ యశ్ ధుల్ సిక్స్ బాదాడు. ఈ క్లాసిక్ షాట్‌తో ప్లే ఆఫ్ ది డే అవార్డు అందుకున్నాడు'అంటూ ఆ వీడియోకు ఐసీసీ క్యాప్షన్ పేర్కొంది. ఆస్ట్రేలియా బౌలర్ టామ్ విట్నీ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్ ఐదో బంతిని యష్ ధుల్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. బంతి షార్ట్ పిచ్ అవగా.. ఫ్రంట్ ఫూట్‌కు వచ్చిన యష్ ధుల్.. డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ బ్యాట్ ఎడ్జ్‌ను తగిలించాడు. అంతే.. బంతి లాంగాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్ టాప్‌లో పడింది. ఈ సిక్స్‌కు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కెప్టెన్ యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్), వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించడంతో భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. లాచ్‌లాన్ షా(51) హాఫ్ సెంచరీ చేయగా.. కోరీ మిల్లర్(38), క్యాంప్‌బెల్ కెల్లావే(30)లు పర్వాలేదనిపించారు.