Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup Final:యశస్వి హాఫ్ సెంచరీ.. మూడు వికెట్లు కోల్పోయిన భారత్

U19 World Cup Final: Yashasvi Jaiswal hits another 50

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. హసన్ షకీబ్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన యశస్వి 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ టోర్నీలో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ కాగా.. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగులు చేయడం గమనార్హం. ప్రస్తుతం 34 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(69 బ్యాటింగ్), జురేల్(2 బ్యాటింగ్) ఉన్నారు.

తొలి 2 ఓవర్లు మెయిడిన్

తొలి 2 ఓవర్లు మెయిడిన్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో ఆతిథ్య పేసర్లు చెలరేగారు. దీంతో భారత ఓపెనర్లు తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేశారు. మూడో ఓవర్ రెండో బంతికి యశస్వీ సింగిల్‌తో భారత్ పరుగుల ఖాతా తెరిచింది. అనంతరం మరో ఓవర్ మెయిడిన్ అవ్వగా.. ఐదో ఓవర్‌లో రెండు ఆరు ఓవర్లో ఒక పరుగు వచ్చింది. దీంతో భారత్ 6 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 పరుగులే చేసింది.

దివ్యాన్ష్ ఔట్..

దివ్యాన్ష్ ఔట్..

ఇక ఏడో ఓవర్‌లో భారత్‌కు గట్టి షాక్ తగిలింది. అవిషాక్ దాస్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతి సక్సెనా బ్యాటింగ్ ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లో ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. మరుసటి ఓవర్‌లో యశస్వీ బౌండరీ సాధించాడు.

ఆ వెంటనే సింగిల్ తీసే క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి తిలక్‌ మోకాలి తగలడంతో మైదానంలో కుప్పకూలాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ చేయడంతో బ్యాటింగ్ సిద్దమైన తిలక్ పరుగు తీయడంలో మాత్రం ఇబ్బంది పడ్డాడు. దీంతో పవర్ ప్లే ముసిగే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది.

94 పరుగుల భాగస్వామ్యం..

94 పరుగుల భాగస్వామ్యం..

బంగ్లా బౌలర్లను ఆచితూచిగా ఎదుర్కొన్న జైస్వాల్-తిలక్ నిదానంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డ బంతులను బౌండరీలకు తరలిచింది. 16 ఓవర్లో చెరొక ఫోర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో యశస్వీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ వెంటనే ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించిన తిలక్ వర్మ(38) బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్రియమ్ గార్గ్(7) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. రకీబుల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం దృవ్ జురేల్ క్రీజులోకి వచ్చాడు.

Story first published: Sunday, February 9, 2020, 16:14 [IST]
Other articles published on Feb 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+