U19 World Cup Final:యశస్వి జైస్వాల్ ఔట్.. కష్టాల్లో భారత్

పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్(88)వికెట్ కోల్పోయింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ సాధించిన ఈ ముంబై సెన్సేషన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన సిద్దేశ్ వీర్(0) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే జురెల్ (22) రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్ 168 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇక అంతకు ముందు 89 బంతుల్లో యశస్వీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషమైతే.. ప్రతీ మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేయడం మరో విశేషం. మొత్తం 6 ఇన్నింగ్స్‌ల్లో 88,105, 62,57 నాటౌట్, 29 నాటౌట్, 57, పరుగులు చేయడం గమనార్హం. ఇక హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ(38)తో కలిసి అతను మూడో వికెట్‌కు 94 పరుగుల, దృవ్ జురేల్‌తో 42 పరుగుల భాగస్వామ్యాలనందించాడు. తిలక్ వర్మ ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ప్రియమ్ గార్గ్(7), తీవ్రంగా నిరాశపరిచాడు.

తొలి 2 ఓవర్లు మెయిడిన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో ఆతిథ్య పేసర్లు చెలరేగారు. దీంతో భారత ఓపెనర్లు తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేశారు. మూడో ఓవర్ రెండో బంతికి యశస్వీ సింగిల్‌తో భారత్ పరుగుల ఖాతా తెరిచింది. అనంతరం మరో ఓవర్ మెయిడిన్ అవ్వగా.. ఐదో ఓవర్‌లో రెండు ఆరు ఓవర్లో ఒక పరుగు వచ్చింది. దీంతో భారత్ 6 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 పరుగులే చేసింది.

దివ్యాన్ష్ ఔట్..
ఇక ఏడో ఓవర్‌లో భారత్‌కు గట్టి షాక్ తగిలింది. అవిషాక్ దాస్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతి సక్సెనా బ్యాటింగ్ ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లో ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. మరుసటి ఓవర్‌లో యశస్వీ బౌండరీ సాధించాడు.
ఆ వెంటనే సింగిల్ తీసే క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి తిలక్ మోకాలి తగలడంతో మైదానంలో కుప్పకూలాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ చేయడంతో బ్యాటింగ్ సిద్దమైన తిలక్ పరుగు తీయడంలో మాత్రం ఇబ్బంది పడ్డాడు. దీంతో పవర్ ప్లే ముసిగే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది.

94 పరుగుల భాగస్వామ్యం..
బంగ్లా బౌలర్లను ఆచితూచిగా ఎదుర్కొన్న జైస్వాల్-తిలక్ నిదానంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డ బంతులను బౌండరీలకు తరలిచింది. 16 ఓవర్లో చెరొక ఫోర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో యశస్వీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ వెంటనే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించిన తిలక్ వర్మ(38) బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్రియమ్ గార్గ్(7) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. రకీబుల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం దృవ్ జురేల్ క్రీజులోకి రాగా.. యశస్వీ ఆచితూచి ఆడారు. మంచి ఫామ్ కనబర్చిన ఈ జోడీని షోరిఫుట్ విడదీసి దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో యశస్వీ, సిద్దేశ్‌లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ వెంటనే జురేల్ సమన్వయ లోపంతో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications