Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup Final: వర్షం అంతరాయం.. డక్‌వర్త్ చాన్సెస్ బంగ్లాకే

 U19 World Cup Final: Rain stops play with Bangladesh ahead on DLS

పోచెఫ్‌స్ట్రూమ్‌(దక్షిణాఫ్రికా) : అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్-భారత్‌ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 15 పరుగులు కావాల్సిన స్థితిలో వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం ఆగితే మిగతా మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ అలానే కొనసాగితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్‌నే విజయం వరించనుంది. విశ్వవిజేతగా నిలవనుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్ యశస్వి జైస్వాల్(88) మరో హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. తిలక్ వర్మ(38), ప్రియమ్ గార్గ్(22) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్(3/40), షోరిఫుల్ ఇస్లామ్(2/31), తజీమ్ హసన్ (2/28)లు భారత్ పతనాన్ని శాసించగా.. రకిబుల్ హసన్ ఒక వికెట్ తీశాడు. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మన్ రనౌట్‌గా వెనుదిరిగడం విశేషం.

అనంతరం 178 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో తడబడిన బంగ్లాదేశ్.. ఓపెనర్ పర్వెజ్ హుస్సెన్ ఎమోన్ (79 బంతుల్లో 7 ఫోర్లతో 47) అద్భుత పోరాటానికి కెప్టెన్ అక్బర్ అలీ(42 బ్యాటింగ్) కడవరకు పోరాడటంతో వర్షం ఆంటకం కలిగించే సమయానికి 41 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 54 బంతుల్లో 15 పరుగులు అవసరం. చేతిలో మూడు వికెట్లున్నాయి.

Story first published: Sunday, February 9, 2020, 21:46 [IST]
Other articles published on Feb 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+