Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup Final: టాస్ గెలిచిన బంగ్లా.. భారత్‌దే బ్యాటింగ్

U19 World Cup Final: Bangladesh bowl against unchanged India

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఒక మార్పు చేయగా.. భారత్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. బంగ్లా జట్టులో హసన్ మురద్ స్థానంలో అవిషేక్ దాస్ తుదిజట్టులోకి వచ్చాడు.

డిఫెండింగ్ చాంపియన్‌గా తమ టైటిల్ నిలబెట్టుకోవాలని ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని భారత్ భావిస్తుండగా.. తొలిసారి ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్ ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని పట్టుదలగా ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలం కావడంతో టాస్ నెగ్గిన బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాడు.

ఈ మ్యాచ్‌‌కు వర్షం ముప్పు ఉంది. ఆదివారం, రిజర్వ్‌‌ డే అయిన సోమవారం ఏదో ఒక సమయంలో భారీ వర్షం వచ్చే చాన్సుంది. తొలి రోజు మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. అక్కడి నుంచే రిజర్వ్‌‌ డే రోజు ఆట కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఆట సాధ్యం కాకపోతే ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.

తుది జట్లు
భారత్ : యశస్వి, దివ్యాంశ్​​ సక్సేనా, తిలక్‌‌ వర్మ, ధ్రువ్‌‌ జురెల్‌‌ (కీపర్‌‌), ప్రియమ్‌‌ గార్గ్‌‌ (కెప్టెన్‌‌), సిద్దేశ్‌‌ వీర్‌‌, అథర్వ అంకోలేకర్‌‌, రవి బిష్నోయ్‌‌, సుశాంత్‌‌ మిశ్రా, కార్తీక్‌‌ త్యాగి, ఆకాశ్‌‌ సింగ్‌‌.

బంగ్లాదేశ్‌‌: పర్వేజ్‌‌, తన్జిద్‌‌ హసన్‌‌, మహ్ముదుల్‌‌ హసన్‌‌, తౌహిత్‌‌ హ్రిదాయ్‌‌, షహదత్‌‌ హుస్సేన్‌‌, షమీమ్‌‌ హుస్సేన్‌‌, అక్బర్‌‌ అలీ (కెప్టెన్‌‌, కీపర్‌‌), రకిబుల్‌‌ హసన్‌‌, షోరిఫుల్‌‌ ఇస్లాం, తన్జిమ్‌‌ హసన్‌‌ షకీబ్‌‌, అవిషేక్ దాస్‌.

Story first published: Sunday, February 9, 2020, 13:30 [IST]
Other articles published on Feb 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+