Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup 2026: అఫ్గాన్‌పై సిక్సర పిడుగు!

Vaibhav Suryavanshi: టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. క్రీజులో ఉన్నంత సేపు అఫ్గాన్ బౌలర్లకు చెమటలు పట్టించాడు.

ఎదుర్కొన్న 33 బంతుల్లోనే క్రికెట్‌లో ఉన్న షాట్స్ అన్ని ఆడాడు. తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్‌తో పాటు ఫ్లిక్, కవర్ డ్రైవ్, ఆన్ డ్రైవ్‌లతో బౌండరీలు రాబట్టాడు. అతను కొట్టిన నాలుగు సిక్స్‌లు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అఫ్గాన్ ఫీల్డర్ ఉజైరుల్లా నియాజై వదిలేసాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

U19 World Cup 2026 Vaibhav Suryavanshi Blazes 33-Ball 68 with 4 sixes in IND vs AFG Semi-Final

అనంతరం మరో రెండు బౌండరీలు, సిక్స్‌ బాదిన సూర్యవంశీ.. పుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తన ప్రధాన బలమైన పుల్ షాట్ కొన్ని సార్లు అతనికి బలహీనతగా మారుతుంది. పాకిస్థాన్‌తో జరిగిన గత సూపర్ సిక్స్ మ్యాచ్‌లో సూర్యవంశీ పుల్ షాట్ ఆడబోయే వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో వెనుదిరిగాడు. వైభవ్ సూర్యవంశీ అందించిన ఆరంభం టీమిండియాకు ఉత్సాహాన్ని అందించింది. వైభవ్ వెనుదిరిగినా.. ఆరోన్ జార్జ్, ఆయుష్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ వరుసగా 2, 72, 40, 52, 30 ,68 పరుగులతో రాణించాడు. ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ మొత్తం 11 సిక్సర్లు బాదగా.. అఫ్గానిస్థాన్‌పైనే 4 కొట్టాడు. జింబాబ్వేపై కూడా 4 సిక్స్‌లు కొట్టిన అఫ్గాన్.. బంగ్లాదేశ్‌పై 3 సిక్స్‌లు బాదాడు.

Story first published: Wednesday, February 4, 2026, 19:08 [IST]
Other articles published on Feb 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+