For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U19 World Cup 2026: భారత బౌలర్లకు బడిత పూజ!

U19 World Cup 2026 టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. దాంతో భారత్ ముందు 311 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అఫ్గాన్ బ్యాటర్లు ఫైసల్ షినోజాడా(93 బంతుల్లో 15 ఫోర్లతో 110), ఉజైరుల్లా నియాజై(86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 310 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఓపెనర్లు ఉస్మాన్ సదత్(70 బంతుల్లో 3 ఫోర్లతో 39), ఖలిద్ అహ్మద్‌జై(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) మెరుగైన ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో దీపేష్ దేవండ్రైన్(2/64), కాన్షిక్ చౌహన్(2/55) రెండేసి వికెట్లు తీసారు.

U19 World Cup 2026 Faisal Shinozada Uzairullah Niazai Tons Power Afghanistan to 310 4 vs India

అదిరిపోయే ఆరంభం..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు ఉస్మాన్ సదత్(39), ఖలిద్ అహ్మద్‌జాయ్(31) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడిని దీపేష్ దేవండ్రన్ విడదీసాడు. ఖలిద్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ ఉస్మాన్‌తో కలిసి ఫైసల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన ఉస్మాన్‌ను కాన్షిక్ చౌహన్ ఔట్ చేశాడు. దాంతో క్రీజులోకి ఉజైరుల్లా నియాజై రాగా.. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను చెడుగుడు ఆడారు.

ఫైసల్ పైసా వసూల్ ఇన్నింగ్స్..

ఈ క్రమంలో 55 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఫైసల్.. అనంతరం మరింత దూకుడుగా ఆడి మరో 31 బంతుల వ్యవధిలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కాస్త నిదానంగా ఆడిన ఉజైరుల్లా నియాజై 63 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 148 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని దీపేష్ విడదీసాడు. అద్భుతమైన బంతితో సెంచరీ హీరో ఫైసల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

అజిజుల్లా మియకిల్‌తో కలిసి నియాజై చెలరేగాడు. భారీ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడి 85 బంతుల్లో శతకం సాధించాడు. హాఫ్ సెంచరీ నుంచి శతకం పూర్తి చేసుకోవడానికి అతనికి 22 బంతులే పట్టింది. ఈ విధ్వంసంతోనే అఫ్గాన్ 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీపేష్, కాన్షిక్ చౌహన్ మినహా భారత బౌలర్లంతా విఫలమయ్యారు. పరుగులను కట్టడి చేయకపోగా.. వికెట్లు కూడా తీయలేకపోయారు. భారత్ ఫైనల్ చేరాలంటే 310 పరుగుల ఈ లక్ష్యాన్ని ఛేదించాలి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై భారత టాపార్డర్ చెలరేగితే ఇది సాధ్యమవుతుంది.

Story first published: Wednesday, February 4, 2026, 16:56 [IST]
Other articles published on Feb 4, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+