Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup 2024: 6 బంతుల్లో 5 సిక్సర్లు.. ఒక ఫోర్! (వీడియో)

ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌లో అరుదైన ఫీట్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ బ్యాటర్ స్టీవ్ స్టోల్క్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లతో పాటు బౌండరీ బాది 34 పరుగులు పిండుకున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

స్కాట్లాండ్ బౌలర్ ఖాసిమ్ ఖాన్ వేసిన మూడో ఓవర్‌లో స్టీవ్ స్టోల్క్ వరుసగా 6,6,6,6,4,6 బాదాడు. దాంతో 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా అండర్ 19 ప్రపంచకప్ టోర్నీల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 37 బంతులు ఆడిన స్టీవ్ స్టోల్క్ 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు.

U19 World Cup 2024: South Africa batter Steve Stolk scores 13-ball 50

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. జామియా డంక్(121 బంతుల్లో 11 ఫోర్లతో 90), ఓవెన్ గౌల్డ్(89 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 97) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా జట్టు స్టీవ్ స్టోల్క్ విధ్వంసంతో 27 ఓవర్లలోనే 3 వికెట్లకు 273 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 140 పరుగులకు కుప్పకూలగా.. పాకిస్థాన్ 25.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 144 పరుగులు చేసి గెలుపొందింది. నమీబియాతో జరిగిన మరో మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన యువ భారత్.. ఆదివారం అమెరికాతో తలపడనుంది.

Story first published: Saturday, January 27, 2024, 21:10 [IST]
Other articles published on Jan 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+