U19 World Cup: భారత్ భారీ స్కోర్.. సచిన్, శరణ్ మెరుపు సెంచరీ!
అండర్ 19 ప్రపంచకప్ 2024లో భారత బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. నేపాల్‌తో జరుగుతున్న తమ ఆఖరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఉదయ్ శరణ్(107 బంతుల్లో 9 ఫోర్లతో 100), సచిన్ దాస్(101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 116) శతకాలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేసింది.
సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(9 నాటౌట్)కు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. 7 బంతులే ఆడిన అతను ఓ బౌండరీతో 9 పరుగులు చేశాడు. నేపాల్ బౌలర్లలో గుల్సాన్ జా మూడు వికెట్లు తీయగా.. ఆకాష్ చాంద్ ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(21), అర్షిణి కులకర్ణి(18), ప్రియాన్షు మోలియా(19) తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో 62 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఉదయ్ శరణ్, సచిన్ దాస్ జట్టును ఆదుకున్నారు.
ఆచితూచి ఆడిన ఈ జోడీ విలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్రీజులో సెట్ అయిన తర్వాత భారీ షాట్లతో చెలరేగింది. ముఖ్యంగా సచిన్ దాస్ దూకుడుగా బ్యాటింగ్ చేయగా.. ఉదయ్ శరణ్ యాంకర్ రోల్ పోషించాడు. నాలుగో వికెట్‌కు 215 పరుగులు జోడించిన అనంతరం సచిన్ ధాస్ ఔటవ్వగా.. చివరి ఓవర్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో ఉదయ్ శరణ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. సెమీస్ బెర్త్ ఖరారు కానుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగింటిలో విజయం సాధించింది. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో రెండు శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications