Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup: నేపాల్‌పై ఘన విజయం.. సెమీఫైనల్లో భారత్!

అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. సూపర్ సిక్స్‌లో భాగంగా నేపాల్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన భారత్ 132 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరడం భారత్‌కు ఇది 11వ సారి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేసింది. కెప్టెన్ ఉదయ్ శరణ్(107 బంతుల్లో 9 ఫోర్లతో 100), సచిన్ దాస్(101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 116) శతకాలతో చెలరేగారు. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(9 నాటౌట్)కు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. 7 బంతులే ఆడిన అతను ఓ బౌండరీతో 9 పరుగులు చేశాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో అతను రెండు శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

U19 World Cup 2024: India beat Nepal to secure semi-final berth for 11th time

నేపాల్ బౌలర్లలో గుల్సాన్ జా మూడు వికెట్లు తీయగా.. ఆకాష్ చాంద్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో సౌమీ పాండే(4/29) నాలుగు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. అర్షిణి కులకర్ణికి రెండు వికెట్లు దక్కగా.. రాజ్ లింబాని, ఆరాధ్య శుక్లా, మురుగణ్ అభిషేక్ తలో వికెట్ తీసారు.

నేపాల్ బ్యాటర్లలో కెప్టెన్ దేవ్ ఖనల్(33), ఓపెనర్లు దీపక్ బోహారా(22), అర్జున్ కుమాల్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ విజయంతో గ్రూప్ 1 టాపర్‌గా భారత్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో నాకౌట్ పోరులో తలపడనుంది. ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా జట్టుతో భారత్ సెమీస్‌లో తలపడే అవకాశం ఉంది.

Story first published: Friday, February 2, 2024, 22:22 [IST]
Other articles published on Feb 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+