U19 World Cup 2024 Final: అందుకే బ్యాటింగ్ తీసుకున్నా: ఆస్ట్రేలియా కెప్టెన్
అండర్ 19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ హ్యూ వీబ్జెన్ అన్నాడు. సీనియర్ ఆస్ట్రేలియా టీమ్‌లా ఫైనల్ చేరి టాస్ గెలవడం అద్భుతమని చెప్పాడు. ఆస్ట్రేలియా తుది జట్టులో ఒక మార్పు చేసింది. టామ్ కాంప్‌బెల్ స్ఠానంలో చార్లీ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నానని టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహరణ్ తెలిపాడు. అయితే ముందుగా బౌలింగ్ చేసేందుకు కూడా తమ జట్టు సన్నదమైందని చెప్పాడు. 'మేం ఒకే ఒక ప్రపంచకప్ ఆడుతాం. ఈ విజయం మాకు ఎంతో గొప్పది. అందరూ ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. వీలైనంత వరకు గేమ్‌ను డీప్‌గా తీసుకెళ్తాం. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని'అని భారత కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్జెన్, హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్, ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రేకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్
భారత్:
ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరణ్, ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, అరవెల్లి అవనీష్, మురుగన్ అభిషేక్, రాజ్ లింబాని, నమన్ తివారీ, సౌమీ పాండే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications