Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup: ఉత్కంఠపోరులో పాకిస్థాన్ పరాజయం.. ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా!

అండర్ 19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. గురువారం ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 1 వికెట్ తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఈ విజయంతో ఫైనల్ దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్ బ్యాటర్లలో అజాన్ అవైస్(91 బంతుల్లో 3 ఫోర్లతో 52), అరఫత్ మిన్‌హాస్(61 బంతుల్లో 9 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగితా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

U19 World Cup 2024: Australia enter 6th final after thrilling 1 wicket win over Pakistan

ఆస్ట్రేలియా బౌలర్లలో టామ్ స్ట్రాకర్(6/24) ఆరు వికెట్ల‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. మహ్లీ బియర్డ్‌మన్, కల్లమ్ విడ్లేర్, రాఫ్ మెక్‌మిలాన్, టామ్‌ కాంప్‌బెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. హారీ డిక్సన్(75 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలివర్ పీక్(75 బంతుల్లో 3 ఫోర్లతో 49), మాక్ మిలన్(29 బంతుల్లో 2 ఫోర్లతో 19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

పాకిస్థాన్ బౌలర్లలో అలీ రాజా నాలుగు వికెట్లు తీయగా.. అరఫత్ మిన్‌హాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉబైద్ షా తలో వికెట్ తీసారు. ఈ పరాజయంతో పాక్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు.

11 పరుగులు 4 వికెట్లు..
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో నెమ్మదిగా ఆడింది. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులే చేసింది. ఆ వెంటనే ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్(14)ను క్లీన్ బౌల్డ్ చేసిన అలీ రాజా పాకిస్థాన్‌కు శుభారంభం అందించాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హుగ్ వెయిబ్‌గెన్(4)‌ను అహ్మద్ ఖాన్ ఔట్ చేయగా.. హర్జాస్ సింగ్(5) రనౌటయ్యాడు. వికెట్ కీపర్ రియాన్ హిక్స్(0)ను ఉబైద్ షా క్లీన్ బౌల్డ్ చేయడంతో 59 పరుగులకే ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 11 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది.

హారీ డిక్సాన్ హాఫ్ సెంచరీ..
ఈ పరిస్థితుల్లో ఓపెనర్ హరీ డిక్సాన్, ఒలివర్ పీక్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో డిక్సాన్ 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 పరుగులతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అర్ఫత్ మిన్‌హాస్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

టామ్ కాంప్‌బెల్‌(25)తో కలిని ఒలివర్ పీక్ పోరాడాడు. 44 పరుగులు జోడించిన అనంతరం టామ్ కాంప్‌బెల్ ఔటవ్వగా.. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఓలివర్‌ను అలీరాజా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

విన్నింగ్ షాట్‌తో..
టామ్ స్ట్రేకర్(3), మహిల్ బియర్డ్‌మన్(0) కూడా విఫలమవడంతో పాకిస్థాన్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. ఓవైపు ఆసీస్ విజయానికి 16 పరుగులు అవసమవ్వగా.. పాకిస్థాన్ గెలుపునకు ఒక్క వికెట్ కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాఫ్ మెక్‌మిలాన్.. కల్లమ్ వైడ్లర్‌తో ఆచితూచి ఆడాడు.

ఓ బౌండరీ బాదడంతో ఆసీస్ విజయానికి 12 బంతుల్లో 6 పరుగులు అవసరమవ్వగా.. ఉబైద్ షా వేసిన 49వ ఓవర్‌లో 3 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్ తొలి బంతికి రాఫ్ మెక్‌మిల్లన్ బౌండరీ బాది ఆసీస్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Thursday, February 8, 2024, 21:28 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+