Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup: చెలరేగిన భారత కుర్రాళ్లు.. బంగ్లాదేశ్‌కు టఫ్ టార్గెట్!

అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు చెలరేగారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్(96 బంతుల్లో 6 ఫోర్లతో 76), కెప్టెన్ ఉదయ్ శరణ్(94 బంతుల్లో 4 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది.

తెలంగాణ బిడ్డ అరవెల్లి అవినాష్(17 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) మెరుపులు మెరిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మరుఫ్ మ్రిధా(5/43) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఎండీ రిజ్వాన్, రెహ్‌మాన్ రాబీ తలో వికెట్ తీసారు.

U19 World Cup 2024: Adarsh Singh, Uday Saharans Knocks Propel India To 251/7 vs Bangladesh

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యంగ్ ఇండియాకు శుభారంభం దక్కలేదు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో‌నే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(7) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే క్రీజులోకి వచ్చిన ముషీర్ ఖాన్ సైతం అదే తరహాలో ఔటయ్యాడు.

దాంతో భారత్ తొలి పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులే చేసింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఉదయ్ శరణ్‌తో కలిసి ఆదర్శ్ సింగ్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో ఆదర్శ్ సింగ్, ఉదయ్ శరణ్ 67 బంతుల్లోనే అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు.

క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఎండీ రిజ్వాన్ విడదీసాడు. సెంచరీ దిశగా సాగిన ఆదర్శ్ సింగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే ఉదయ్ శరణ్ కూడా ఔటవ్వగా.. ప్రియాన్షు మోలియాతో అరవెల్లి అవినాష్ ధాటిగా ఆడాడు. దూకుడుగా ఆడుతున్న అతన్ని మరుఫ్ మ్రిధా ఔట్ చేయగా.. సచిన్ ధాస్(26 నాటౌట్) ధాటిగా ఆడిన భారత స్కోర్‌ను 251 ధాటించాడు.

Story first published: Saturday, January 20, 2024, 17:39 [IST]
Other articles published on Jan 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+