U19 World Cup 2022: సెన్సేషనల్ రనౌట్.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అఫ్గానిస్థాన్!

అండర్ 19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 4 పరుగుల తేడాతో ఆ జట్టు గెలుపొందింది. ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. చేతిలో ఓ వికెట్ ఉండగా.. లంక విజయానికి 25 బంతుల్లో 5 పరుగులు కావాలి. కానీ అఫ్గాన్ సెన్సేషనల్ రనౌట్‌తో విజయాన్నందుకొని సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
శ్రీలంక బ్యాట్స్‌మన్ వినుజ రాన్‌పాల్ పాయింట్ దిశగా ఆడి పరుగుకు ప్రయత్నించగా.. బంతిని అందుకున్న ఫీల్డర్ బౌలర్‌కు బంతిని అందించగా.. అతను ఏ తప్పిదం చేయకుండా వికెట్లను గిరాటేసాడు. దాంతో అఫ్గాన్ విజయాన్నందుకొని సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 47.1 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్ హది(37), నూర్ అహ్మద్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేదనకు దిగిన శ్రీలంక జట్టు 46 ఓవర్లలలో 130 పరుగులకు కుప్పకూలింది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications