Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!

U19 Women’s T20 World Cup Final: India win toss and opt to bowl, Playing XI named

పాచెఫ్‌స్టూమ్(సౌతాఫ్రికా): అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత కెప్టెన్ షెఫాలీ వర్మ తెలిపింది. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించింది. ఈ పిచ్‌పై జరిగిన గత రెండు సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ చేజింగ్‌కు మొగ్గు చూపింది.

కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్లు భారత బౌలర్లు కూడా తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి శుభారంభం అందించారు. ఇంగ్లండ్ ఓపెనర్ లిబెర్టీ హీప్‌ను టిటాస్ సదు సిల్వర్ డక్‌గా పెవిలియన్ చేర్చింది. ఇక భారత మహిళల జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. సీనియర్ మహిళల టీమ్ మూడు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినా.. టైటిల్ అందుకోలేకపోయారు. దాంతో మహిళల విభాగంలో తొలి ఐసీసీ టైటిల్ అందించే సువర్ణవకాశం షెఫాలీ సేన ముందు ఉంది. అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత అమ్మాయిలు.. టైటిల్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగారు.

తుది జట్లు
భారత జట్టు: షెఫాలీ వర్మ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సౌమ్య తివారీ, గొంగడి త్రిష, రిచా ఘోష్(కీపర్), హృషితా బసు, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, సోనమ్ యాదవ్

ఇంగ్లండ్ : గ్రేస్ స్క్రివెన్స్(కెప్టెన్), లిబర్టీ హీప్, నియామ్ ఫియోనా హాలండ్, సెరెన్ స్మేల్(కీపర్), ర్యానా మక్డోనాల్డ్ గే, చారిస్ పావెలీ, అలెక్సా స్టోన్‌హౌస్, సోఫియా స్మేల్, జోసీ గ్రోవ్స్, ఎల్లీ ఆండర్సన్, హన్నా బేకర్

Story first published: Sunday, January 29, 2023, 17:59 [IST]
Other articles published on Jan 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+