Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U-19 ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగతం.. అంత కలలా ఉందన్న త్రిష!

U19 sensation Gongadi Trisha receives warm welcome in Hyderabad after T20 World Cup win

హైదరాబాద్: అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన తెలంగాణ మహిళా క్రికెటర్లు గొంగడి త్రిష, సొప్పదండి యశశ్రీలతో పాటు జట్టు ఫిజికల్‌ ట్రైనర్‌ షాలినిలకు గురువారం ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయంలో వీళ్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌తో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఈ చాంపియన్స్‌ను ఘనంగా సత్కరించారు. అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచక్‌పలో చాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యులుగా ఉండటం తమ అదృష్టమని త్రిష, యశశ్రీ వ్యాఖ్యానించారు.

సీనియర్ టీమ్‌లో ఆడటమే టార్గెట్..

సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న లక్ష్యమని గొంగడి త్రిష స్పష్టం చేసింది. ఓ చానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో సత్తా చాటడం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలవడం అంతా కలలా అనిపిస్తోందని తెలిపింది.

తన తండ్రి ప్రోత్సాహంతోనే క్రీడల్లోకి ప్రవేశించానని చెప్పిన త్రిష.. అండర్‌19 ప్రపంచకప్ విజయాల్లో తన పాత్ర పోషించడం గర్వంగా ఉందని చెప్పింది.

ఆ ఆనందం మాటల్లో చెప్పలేను..

ఆ ఆనందం మాటల్లో చెప్పలేను..

'అండర్‌-19 టీ20 ప్రపంచక్‌పలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. కచ్చితంగా టోర్నీ ద్వారా నేనేంటో నిరూపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అనుకున్నట్లే జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. గ్రూప్‌ దశలో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ (57)తో చేశా. ఇది నాకు గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌. నా ప్రదర్శనపై కెప్టెన్‌తో పాటు కోచ్‌ సహా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

బౌండరీలతో ఒత్తిడి తగ్గించుకున్నా..

బౌండరీలతో ఒత్తిడి తగ్గించుకున్నా..

టోర్నీ ఆరంభం నుంచే మా ప్రదర్శనపై జట్టు సభ్యులమంతా పూర్తి ఆత్మవిశాస్వంతోనే ఉన్నాం. అయితే, ఇంగ్లండ్‌తో తుదిపోరులో నేను కొంచెం టెన్షన్‌గా ఫీలయ్యా. ఎందుకంటే ఆ పోరులో జట్టు స్వల్ప లక్ష్యఛేదనలో నేను క్రీజులోకొచ్చేసరికే రెండు వికెట్లు పడ్డాయి. దీంతో కాస్త ఒత్తిడిగానే మైదానంలోకి అడుగుపెట్టా, వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఊపిరి పీల్చుకున్నా. ఆపై మరో బౌండరీ బాది 26 పరుగులు చేశా. ఆ వెంటనే ఔటైనా అప్పటికే విజయంపై నమ్మకం కలగడంతో ఆందోళనకు గురవలేదు.

డబ్ల్యూపీఎల్‌పై ఆశలు

డబ్ల్యూపీఎల్‌పై ఆశలు

జాతీయ జట్టులో చోటుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) చక్కటి వేదిక. మహిళల ఐపీఎల్‌లో ఏదో ఒక జట్టుకు ఎంపికవుతానని అనుకుంటున్నా. అక్కడ అదరగొడితే, కచ్చితంగా సీనియర్‌ జట్టుకు పిలుపు వస్తుంది. సచిన్‌ టెండూల్కర్‌ నుంచి ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మరచిపోలేనిది. జట్టు మొత్తం సంతోషంగా ఫీలైంది. స్టేజ్‌పైన మా అందరి గురించి సచిన్‌ సార్‌ పొగిడారు. ఇలాంటి అవకాశం అందరికీ రాదు.'అని త్రిష చెప్పుకొచ్చింది.

Story first published: Friday, February 3, 2023, 8:16 [IST]
Other articles published on Feb 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+