Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్ 19 ప్రపంచకప్ హీరోకు హార్ట్ సర్జరీ!

కెప్టెన్‌‌గా భారత్‌కు అండర్ 19 ప్రపంచకప్ 2022 అందించిన యశ్ ధుల్‌కు హార్ట్ సర్జరీ జరిగింది. ఈ శస్త్రచికిత్స నుంచి కోలుకున్న ఈ ఢిల్లీ కుర్రాడు.. తిరిగి ఆటను కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టుకు యశ్ ధుల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన యశ్ ధుల్ 93 పరుగులు చేశాడు. ఈ ఏడాది జూన్ నుంచి జులై మధ్యలో అండర్ 23 హైపర్ ఫార్మెన్స్ క్యాంప్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరినప్పుడు యశ్ ధుల్ గుండెలో చిన్న రంధ్రం ఉన్నట్లు అక్కడి వైద్యులు గుర్తించారు. దాంతో అతనికి మైనర్ సర్జరీ చేశారని అతని కోచ్ రాజేశ్ నగార్ తెలిపాడు.

U-19 World Cup winning captain Yash Dhull makes return from heart surgery

'యశ్ ధుల్‌కు జరిగింది చిన్న శస్త్ర చికిత్స. అతను 15 రోజుల్లోనే కోలుకున్నాడు. ప్రస్తుతం ఆట, ఫిట్‌నెస్ పరంగా అతను 100 శాతం ఫిట్‌గా లేడు. కానీ 80 శాతం ఫిట్‌నెస్ సరిపోతుంది. అతని గుండెలో గుర్తించింది చిన్న రంధ్రమే. అది పుట్టుకతోనే ఉంది.

కానీ ఇప్పుడు బయటపడింది. అతను త్వరలోనే తన ఆటతో అత్యుత్తమ స్థాయికి చేరుకుంటాడు.'అని రాజేశ్ పేర్కొన్నాడు. ధుల్‌కు గత నెలలో సర్జరీ జరిగింది. కెరీర్ ఆరంభంలోనే యశ్ ధుల్ ఎత్తు పల్లాలను చూశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, August 29, 2024, 8:32 [IST]
Other articles published on Aug 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+