అండర్ 19 ఆసియాకప్ 2024లో భారత్ మరో విజయాన్ని సాధించింది. యూఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలిచిన భారత అండర్ 19 టీమ్.. సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏలో పాకిస్థాన్, యూఏఈ, జపాన్‌తో ఉన్న భారత్.. 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి టేబుల్ రన్నరప్‌గా సెమీఫైనల్ చేరింది.
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. ముహమ్మద్ రయన్(35) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో యుధజిత్ గుహ మూడు వికెట్లు తీయగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తీకేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.1 ఓవర్లలో 143 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే(51 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 6 సిక్సర్లతో అలరించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగే చేసిన ఈ చోటా సూరీడు.. జపాన్‌తో 23 పరుగులకే వెనుదిరిగాడు. మూడో మ్యాచ్‌లో మాత్రం తన అసలు సిసలు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ఈ చోటీ సూరీడుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడైన ఆటగాడిగా ఈ బీహార్ కుర్రాడు రికార్డ్ సాధించాడు. అంతేకాకుండా అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్నవయస్కుడిగా కూడా నిలిచాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది.