న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ రోహిత్ అన్నారు.. ఏం ఆడాడు? అతని అభిమానుల ముఖ చిత్రం ఏంటో? పేలుతున్న సెటైర్స్!

Twitterati troll Rohit Sharma for giving his wicket to birthday boy Josh Hazlewood

సిడ్నీ: చాలా రోజుల తర్వాత ఎన్నో అంచనాల మధ్య మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో హిట్‌మ్యాన్ అంచనాలను అందుకోలేకపోయాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మంచి ఆరంభాన్ని అందించిన రోహిత్.. 26 పరుగుల స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. బర్త్‌డే బాయ్ జోష్ హజెల్ వుడ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో హిట్ మ్యాన్‌పై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. అతను ఎప్పటికీ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ కాలేడని, అతని అభిమానుల పరిస్థితి ఏంటోనని నెటిజన్లు ఎత్తిపొడుస్తున్నారు.

రోహిత్ ఏం ఆడాడు..

రోహిత్ ఏం ఆడాడు..

ఆస్ట్రేలియా పర్యటన ముందు నుంచి రోహిత్ శర్మ.. రోహిత్ శర్మ అంటున్నారని, తీరా అతను తుస్సుమనిపించాడని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అతని ఆట పట్ల రోహిత్ ఫ్యాన్స్ ముఖ చిత్రాలు ఎంటోనని కామెంట్ చేస్తున్నారు. స్వదేశంలో ఆడినట్లు రోహిత్ శర్మ విదేశాల్లో ఆడలేడని, అతను ఎప్పటికీ గొప్ప టెస్ట్ బ్యాట్స్‌మెన్ కాలేడని కామెంట్ చేస్తున్నారు. అతని ఔట్‌సైడ్ యావరేజ్‌లానే 26 పరుగులు చేశాడని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ 74 పరుగుల దూరంలో సెంచరీ విస్సయ్యాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఓపిక లేకుంటే ఎలా..?

టెస్ట్ క్రికెట్ అంటేనే ఓపికగా ఆడాలని, ఆ మాత్రం ఓపిక కూడా లేకుంటే ఎలా అని విమర్శకులు రోహిత్‌పై మండిపడుతున్నారు. ఈ తరహా దూకుడు టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని అభిప్రాయపడుతున్నారు. 'నిజాయితీగా చెప్పాలంటే రోహిత్ తన బాధ్యతను నెరవేర్చలేకపోయాడు. ఓవర్‌సిస్‌లో పరుగు పరుగు నిదానంగా చేస్తేనే సక్సెస్ అవుతాం. ఈ 34 ఏళ్ల పిల్లోడు త్వరలోనే నేర్చుకుంటాడు'అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. 'రోహిత్ శర్మ బర్త్‌డే బాయ్ జోష్ హజెల్ వుడ్‌కు గిఫ్ట్ ఇచ్చాడు. 10 మంది ఫీల్డర్లు, ఇద్దరు అంపైర్లను కాదని నేరుగా అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.'అని మరొకరు కామెంట్ చేశారు.

ఆసీస్ భారీ స్కోర్..

ఇక 166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.

భారత్ 96/2

భారత్ 96/2

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 2 వికెట్లకు 96 రన్స్ చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(9 బ్యాటింగ్), అజింక్యా రహానే (4) ఉన్నారు. శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించినా..రోహిత్ శర్మ(26) నిరాశపరిచాడు. తొలి వికెట్‌కు 70 పరగుల భాగస్వామ్యాన్ని అందించిన హిట్ మ్యాన్.. ఆ ఓపికను కొనసాగించలేకపోయాడు. ఆ కొద్ది సేపటికే కమిన్స్ శుభ్‌మన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

Story first published: Friday, January 8, 2021, 17:17 [IST]
Other articles published on Jan 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X