అప్పుడు వన్డేలకు.. ఇప్పుడేమో టీ20లకు.. బీసీసీఐ తీరుపై సంజూ శాంసన్ ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: కొత్త ఏడాదిలో టీమిండియా సరికొత్తగా మారనుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయిలో జట్టు పగ్గాలు అందుకోబోతున్నాడు.
జనవరి తొలి వారంలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు అతనే భారత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ తర్వాత ఆ జట్టుతో జరిగే వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కొన్నేళ్ల ముందే టీ20లకు దూరమైన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఇప్పుడు వన్డే జట్టులోనూ చోటు కోల్పోయాడు. శ్రీలంకతో సొంతగడ్డపై వచ్చే నెల 3 నుంచి 15 వరకు జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత జట్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టీమ్స్ వివరాలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
సంజూ.. టీ20 సిరీస్‌కేనా..?
పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రిషభ్ పంత్ రెండు జట్లలో చోటు దక్కించుకోలేకపోయాడు. న్యూజిలాండ్‌తో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ రెండు సిరీస్‌లకు వికెట్ కీపర్‌గా ఎంపికవ్వగా.. స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను కేవలం టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే సంజూ శాంసన్‌ను ఒక్క సిరీస్‌కే పరిమితం చేయడంపై అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ కెరీర్ నాశనం చేసేందుకే సెలెక్టర్లు ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. రెండు సిరీస్‌లకు అతన్ని ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
అప్పుడేమో వన్డేలకు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ కోసం సన్నదమవుతున్నప్పుడు అంతగా ప్రాధాన్యత లేని వన్డే సిరీస్‌లకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారని గుర్తు చేస్తున్నారు. తాజాగా వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సిద్దమవుతుంటే టీ20 సిరీస్‌లకు ఎంపిక చేస్తున్నారని, బీసీసీఐ తీరు అమానుషమని మండిపడుతున్నారు. వరల్డ్ కప్ ఆడే సామర్థ్యం సంజూ శాంసన్‌కు లేదనుకుంటున్నారా? అని మండిపడుతున్నారు. ఇక వన్డే ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లంతా కొత్త ఏడాది టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉండనున్నారు.
థ్యాంక్యూ అతియా..
టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. తన ప్రియ సఖి అతియా శెట్టిని వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే కేఎల్ రాహుల్ టీ20 సిరీస్‌కు దూరమవ్వడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్యూ అతియా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ దారుణంగా విఫలమవుతున్నాడు. అయినా.. వైస్ కెప్టెన్ హోదాలో అతను జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. రాహుల్ కోసం వన్డే టీమ్ నుంచి సంజూ శాంసన్‌ను పక్కనపెట్టారు.
శ్రీలంకతో ఆడే భారత జట్లు:
శ్రీలంకతో మూడు టీ20లు జనవరి 3, 5, 7 తేదీల్లో ముంబై, పుణె, రాజ్‌కోట్‌ల్లో జరుగుతాయి. 10, 12, 15 తేదీల్లో జరిగే వన్డేలకు గువాహటి, కోల్‌కతా, తిరువనంతపురం ఆతిథ్యమిస్తాయి.
టీ20 జట్టు: హార్దిక్ (కెప్టెన్), సూర్యకుమార్, ఇషాన్, రుతురాజ్, శుభ్‌మన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, సుందర్, చాహల్, అక్షర్, అర్ష్‌దీప్, హర్షల్, ఉమ్రాన్, శివమ్ మావి, ముకేశ్ కుమార్.
శ్రీలంకతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: రోహిత్ (కెప్టెన్), హార్దిక్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సుందర్, చాహల్, కుల్‌దీప్, అక్షర్ పటేల్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications