రికార్డు: అత్యంత వేగంగా 300 సిక్సులు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్


హైదరాబాద్: ఆసియా కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‍లో మూడు ఫార్మాట్లలో అత్యంత వేగంగా 300 సిక్సులు బాదిన రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 సిక్సులు బాదేందుకు గాను రోహిత్ శర్మ 301 ఇన్నింగ్స్‌లు తీసుకోగా... షాహిద్ అఫ్రిది కేవలం 276 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డుని అందుకున్నాడు. 43 టెస్టుల్లో 29 సిక్సులు, 181 వన్డేల్లో 189 సిక్సులు, 33 టీ20ల్లో 89 సిక్సులు బాదాడంతో రోహత్ శర్మ ఖాతాలో మొత్తం 301 సిక్సులు చేరాయి.


300కుపైగా సిక్సులు బాదిన ఏడో బ్యాట్స్‌మెన్
తద్వారా, అంతర్జాతీయ క్రికెట్‌లో 300కుపైగా సిక్సులు బాదిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకముందు షాహిద్ అఫ్రిది (508 ఇన్నింగ్స్‌ల్లో 476), క్రిస్ గేల్(513 ఇన్నింగ్స్‌ల్లో 476), బ్రెండ్స్ మెక్‌కల్లమ్ (474 ఇన్నింగ్స్‌ల్లో 398), సనత్ జయసూర్య (651 ఇన్నింగ్స్‌లో 352), ధోని(500 ఇన్నింగ్స్‌ల్లో 342), ఏబీ డివిలియర్స్(484 ఇన్నింగ్స్‌ల్లో 328) ఉన్నారు.

ఒక్కో ఇన్నింగ్స్‌కు ఒక్కో సిక్సు
రోహిత్ శర్మ సిక్సుల రికార్డుని పరిశీలిస్తే ఒక్కో ఇన్నింగ్స్‌కు ఒక్కో సిక్సు బాది షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్ కంటే మెరుగ్గా ఉన్నాడు. ప్రపంచంలో అత్యధిక సిక్సులు బాదిన షాహిధ్ అఫ్రిది యావరేజి 0.93 ఉండగా, క్రిస్‌గేల్ యావరేజి 0.86గా ఉంది. ఇక, భారత్ తరుపున 300 సిక్సులు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అతడికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 500 ఇన్నింగ్స్‌ల్లో 432 సిక్సులు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.

అరుదైన ఘనత
7వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మెన్‌గా
ఇదిలా ఉంటే, 47 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం 40 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే 7000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

181: అత్యంత తక్కువ ఇన్నింగ్స్
అంతేకాదు ఈ మైలురాయిని సాధించేందుకు అత్యంత తక్కువ ఇన్నింగ్స్ (181) తీసుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అతడికంటే ముందు హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా, 150), విరాట్ కోహ్లీ (ఇండియా, 161), ఏబీ డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా, 166), సౌరవ్ గంగూలీ (ఇండియా, 174) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications