ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌తో రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఇక మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
ఈ ఫేర్‌వెల్ సిరీస్‌లో డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి మ్యాచ్‌లో వార్నర్(164) భారీ శతకంతో మెరిసాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అతను డకౌటయ్యాడు. రెండో టెస్ట్‌లో 36, 6 పరుగులే చేశాడు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు వార్నర్ సిద్దమవుతున్నాడు. ఈ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు వార్నర్ గుడ్ బై చెప్పనున్నాడు.

ఈ మ్యాచ్ కోసం వార్నర్ ముమ్మర సాధన చేస్తున్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా వార్నర్ కోసం అతని చిన్న కూతురు ఇస్లా రోస్ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. నాన్నను హగ్ చేసుకునేందుకు ఈ చిన్నారి.. ఏకంగా గ్రిల్స్‌లో నుంచి లోపలికి వెళ్లింది. తండ్రిని హగ్ చేసుకొని మళ్లీ వెనక్కి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల మనస్సులను గెలుచుకుంది. 'నాన్న నువ్వు నా ప్రాణం అనినా..'అనే సాంగ్‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
టెస్ట్ క్రికెట్‌లో డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడి 44.58 సగటుతో 8695 రన్స్ చేశాడు. ఇందులో 26 శతకాలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి డేవిడ్ వార్నర్ 40 ఇన్నింగ్స్‌ల్లో 37.45 సగటుతో 1498 రన్స్ చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.