Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ప్రాక్టీస్.. నెట్టింట పేలుతున్న సెటైర్స్!

Twitterati can’t keep calm after Virat Kohli and Rohit Sharma reunite in a fielding session

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మళ్లీ విభేదాలున్నాయని గత ఏడాదిన్నరగా ప్రచారం జరుగుతోంది. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపచంకప్ జట్టు ఎంపిక విషయంలో ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని, సెమీస్ ఓటమి అనంతరం మరింత బలపడ్డాయనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్, విరాట్ కోహ్లీ స్వయంగా క్లారిటీ ఇచ్చినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. అనంతరం ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పరిస్థితులు కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.

ఐపీఎల్‌లో కూడా..

ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా ఈ ఇద్దరు మాట్లాడుకోకపోవడం.. కనీసం ఒకరి ముఖం మరొకరు చూసుకోకపోవడం, రోహిత్ శర్మను సోషల్ మీడియా వేదికగా అనుష్కా శర్మ అన్‌ఫాలో కావడం.. విరాట్ కోహ్లీ బర్త్‌డేకు రోహిత్ విషెస్ చెప్పకపోవడం.. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ఎంపిక కాకపోవడం.. ఆ తర్వాత ఎంపికైనా జట్టుతో ఆసీస్‌కు వెళ్లకపోవడం.. అసలు రోహిత్ గురించి తనకేం తెలియదని విరాట్ మీడియా ముఖంగా చెప్పడం వీరి మధ్య విభేదాలు నిజమే అని చెప్పుకునేలా చేశాయి.

విరాట్‌తో కలిసి..

అయితే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ ఎంపికవ్వగా.. పెటర్నిటీ లీవ్ అనంతరం విరాట్ జట్టులోకి వచ్చాడు. ఇక ఈ ఇద్దరు మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో జాలీ గడుపుతూ చమటోడ్చారు. ఇద్దరూ కలిసే ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ సమక్షంలో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పక్కపక్కనే ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రోహిత్-కోహ్లీ కలిసిపోయారంటూ అభిమానులు తెగ సంబరపడిపోగా మరికొందరూ ఫన్నీ కామెంట్లు చేశారు.

అభిమానుల మధ్యే గొడవలు..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారని, కానీ వారి అభిమానులే సోసల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య గొడవలు లేవంటావా? అయితే ఈ ఇద్దరు కౌగిలించుకున్న, మాట్లాడుకుంటున్న ఫొటోలు, వీడియోలు చూపించండని ఇంకొకరు సెటైరిక్‌గా కామెంట్ చేశారు. హమ్మయ్యా ఈ ఇద్దరు కలిసారన్నమాట.. భారత జట్టుకు డోకాలేదని ఇంకొంకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం విరాట్-రోహిత్ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

విరాట్‌ను విష్ చేసిన రోహిత్..

విరాట్‌ను విష్ చేసిన రోహిత్..

జనవరి 11న విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ రోజు తండ్రైన విరాట్‌కు రోహిత్ శర్మ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. విరాట్ కోహ్లీని హిట్ మ్యాన్ విష్ చేయడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇది గొప్ప అనుభూతి. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మకు అభినందనలు. ఆ దేవుడు చల్లగా చూడాలి'అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, February 3, 2021, 19:59 [IST]
Other articles published on Feb 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+